చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2021-02-27T12:34:03+05:30 IST

చోరీ కేసులో ఇద్దరిని వెంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు, తిరువళ్లూర్‌ జిల్లా ఎల్లాపురం యూనియన్‌ తామరైపాక్కం పొల్లాచ్చి అమ్మన్‌ ఆలయ వీధికి చెందిన ...

చోరీ కేసులో ఇద్దరి అరెస్టు

చెన్నై/గుమ్మిడిపూండి (ఆంధ్రజ్యోతి): చోరీ కేసులో ఇద్దరిని వెంగల్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు, తిరువళ్లూర్‌ జిల్లా ఎల్లాపురం యూనియన్‌ తామరైపాక్కం పొల్లాచ్చి అమ్మన్‌ ఆలయ వీధికి చెందిన శశికుమార్‌ కుమారుడు క్యాన్సర్‌ బాధపడుతూ చెన్నై రాయపేట ప్రభుత్వాసుపత్రిలో ఆరు నెలలుగా చికిత్స పొందుతున్నాడు. గత నెల 28న చికిత్స కోసం నగదు అవసరం కాగా, శశికుమార్‌ భార్య మీనా నగలను తాకట్టు పెట్టేందుకు బీరువా తెరవగా  అందులో ఉంచిన 22 సవర్ల బంగారు నగలు అదృశ్యం కావడం గుర్తించి దిగ్ర్భాంతి చెందింది. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో విచారణ చేపట్టిన వెంగల్‌ పోలీసులు శశికుమార్‌ బంధువు కార్తీక్‌ను అనుమానించి అదుపులోకి తీసుకొని విచారించగా తానే ఈ చోరీకి పాల్పడినట్లు, దొంగిలించిన నగలను ఆరంబాక్కంకు చెందిన శాంతి వద్ద ఉంచినట్లు అంగీకరించాడు. దీంతో కార్తీక్‌, శాంతిలను అరెస్ట్‌ చేసిన పోలీసులు కోర్టులో హాజరుపరచి జైలుకు తరలించారు.

Updated Date - 2021-02-27T12:34:03+05:30 IST