చెన్నైలో రికార్డు స్థాయిలో వర్షం

ABN , First Publish Date - 2021-07-19T16:41:02+05:30 IST

చెన్నైలో కురిసిన భారీ వర్షం కొత్త రికార్డును సృష్టించింది. మూడేళ క్రితం నగరంలో జూలై నెలలో ఒకే రోజు 69.5 మి.మీల వర్షపాతం నమోదై కొత్త రికార్డు సృష్టించగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ ...

చెన్నైలో రికార్డు స్థాయిలో వర్షం

కొడైకెనాల్‌లో కుంభవృష్టి

మరో 11 జిల్లాలకు వాన సూచన


చెన్నై: చెన్నైలో కురిసిన భారీ వర్షం కొత్త రికార్డును సృష్టించింది. మూడేళ క్రితం నగరంలో జూలై నెలలో ఒకే రోజు 69.5 మి.మీల వర్షపాతం నమోదై కొత్త రికార్డు సృష్టించగా, ఆ రికార్డును బద్దలు కొడుతూ శనివారం రాత్రి 84 మి.మీల వర్షపాతం నమోదైంది. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో వాయు గుండం ఏర్పడడంతో మరో రెండు రోజులపాటు చెన్నై సహా పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో శని, ఆదివారాల్లో రాత్రి వేళల్లో కురిసిన భారీ వర్షానికి నగరం తడిసిముద్దయింది. పలుచోట్ల కాల్వల్లో మురుగు వర్షపునీటితో కలిసి రహ దారులపై పొంగిపొర్లింది. పోలీసులు, కార్పొరేషన్‌ సిబ్బంది కలసి నగరంలో పలుచోట్ల పూడుకుపోయిన కాల్వలలోని చెత్తాచెదారాన్ని తొలగించారు. స్థానిక నుంగంబాక్కం, గణేశపురం సబ్‌వేల్లో ప్రవహించిన వర్షపునీటిని కూడా మోటారు పంపుల ద్వారా తొలగించారు.  జూన్‌ ఒకటి నుంచి 16 వరకు 176.2 మి.మీలు, మీనంబాక్కంలో 171.7 మి.మీల వర్షపాతం నమో దైంది. ఇవి సాధారణ వర్షపాతం కంటే అధికమని వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు తెలిపారు. చెన్నై జోన్‌లో జూన్‌, జూలైల్లో 130.6 మి.మీల వర్షపాతం నమోదుకావటం ఆనవాయితీ అని, ఈసారి 161.6 మి.మీ మేర వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు. గత మూడు రోజుల్లో శనివారం రాత్రి కురిసిన వర్షమే అధికమని తెలిపారు. ఆదివారం రాత్రి సైతం నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే మేఘావృతమై వాతావరణం చల్లగా ఉండగా, రాత్రి భారీ వర్షం కురిసింది. 


కొడైకెనాల్‌లో వర్షబీభత్సం

దిండుగల్‌ జిల్లా కొడైకెనాల్‌లో గత ఐదు రోజులుగా కురిసిన కుండపోత వర్షానికి జనజీవనం స్తంభించింది. ఉరుములు మెరుపులు, పెనుగాలులతో కురిసిన వర్షానికి గిరిజన ప్రాంతాల్లోని పదిళ్లు ధ్వంసమయ్యాయి. అక్కడ క్కడా చెట్లు రహదారులపై కూలిపడ్డాయి. కొన్ని చెట్లు విద్యుత్‌ స్తంభాలు, తీగలపై పడటంతో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తహసీ ల్దార్‌ మురుగేశన్‌ వర్షబాధిత ప్రాంతాల్లో నివారణ చర్యలు చేపట్టారు. అగ్నిమాపకదళం రంగంలోకి దింపి రహదారులపై కూలిన చెట్లను తొల గించారు. వర్షబాధితులను, ఇళ్లు కోల్పోయినవారిని అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలించారు. ఇదే విధంగా దెబ్బతిన్న రహ దారులను మరమ్మతు చేయడం, చెట్లను తొలగించడం వంటి పనులను హైవేస్‌, ప్రజాపనులు, అటవీ శాఖల అధికారులు సమష్టిగా చేపడుతు న్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో 11 జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ పరిశోధన కేంద్రం ప్రకటించింది. ఆ మేరకు నీలగిరి, కోయంబత్తూరు, తేని, ఈరోడ్‌, తిరుప్పూరు, సేలం, ధర్మపురి, కృష్ణగిరి, తిరుపత్తూరు, వేలూరు, రాణిపేట జల్లాలో ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తా యని పేర్కొంది. ఈనెల 21న బంగాళాఖాతంలో వాయుగుండం తీవ్రరూపం దాల్చటంతో రాష్ట్రంలో పలు చోట్ల, ముఖ్యంగా సముద్రతీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వివరించింది. 

Updated Date - 2021-07-19T16:41:02+05:30 IST