పేదలను ఆదుకుంటున్న సంఘ సేవకుడు

ABN , First Publish Date - 2021-05-17T17:41:54+05:30 IST

నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి దినేష్‌ శరవణన్‌కు సమాజసేవవపై ఆసక్తి ఉంది. ఆయన, తన స్నేహితులతో కలసి అబ్దుల్‌ కలామ్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి

పేదలను ఆదుకుంటున్న సంఘ సేవకుడు

చెన్నై/వేలూరు: నగరానికి చెందిన ఐటీ ఉద్యోగి దినేష్‌ శరవణన్‌కు సమాజసేవవపై ఆసక్తి ఉంది. ఆయన, తన స్నేహితులతో కలసి అబ్దుల్‌ కలామ్‌ వాట్సాప్‌ గ్రూప్‌ ఏర్పాటుచేసి చేతనైన సహాయం చేస్తుంటారు. కరోనా కాలంలో మాస్కులు, శానిటైజర్లు, కబసుర కషాయం పంపిణి చేశారు. అలాగే, సమీపంలోకి కొండ ప్రాంతాల్లో పక్షులకు తాగునీరు అందేలా బక్కెట్లు ఏర్పాటుచేసి, ప్రతిరోజు స్నేహితులతో కలసి బక్కెట్లలో నీరు పోస్తున్నారు. ఈ నేపథ్యంలో, సేన్‌పాక్కంకు చెందిన ఈశ్వరి అనే పేదరాలు తన ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. ఆమె ఇళ్లల్లో పని చూస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వారు నివసిస్తున్న గుడిసె శిధిలావస్థకు చేరు కుంది.  ఈ విషయం తెలుసుకున్న వాట్సాప్‌ గ్రూప్‌ సభ్యులు తమ స్వంత ఖర్చుతో గుడిసెకు మరమ్మతులు చేశారు. దీంతో, ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - 2021-05-17T17:41:54+05:30 IST