నేటి నుంచి చెన్నై-కెవడియా వీక్లీ రైలు

ABN , First Publish Date - 2021-01-17T05:19:24+05:30 IST

చెన్నై నుంచి కెవడియా (09119) సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ రైలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన చీఫ్‌ కమర్షియల్‌ మేనేజరు తెలిపారు. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు.

నేటి నుంచి చెన్నై-కెవడియా వీక్లీ రైలు

ఢిల్లీ నుంచి ప్రారంభించనున్న ప్రధాని నరేంద్రమోదీ

కడప (ఎర్రముక్కపల్లె), జనవరి 16 : చెన్నై నుంచి కెవడియా (09119) సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ రైలు ఆదివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుంతకల్లు డివిజన చీఫ్‌ కమర్షియల్‌ మేనేజరు తెలిపారు. ఈ రైలును ఢిల్లీ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఆదివారం ఉదయం 11.12 గంటలకు చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన నుంచి ప్రారంభమై రేణిగుంటకు మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటుందని, తిరిగి 2.40కి బయలుదేరి కడప రైల్వేస్టేషనకు సాయంత్రం 4.31కు చేరుకుని 4.33కి కడప నుంచి బయలుదేరి గుంతకల్లు, రాయచూరు, వాడీ, షోలాపూర్‌, పూణె, కళ్యాణ్‌, వసై, సూరత, వడోదర, టబ్బోయి మీదుగా కెవడియా చేరుకుంటుందన్నారు. చెన్నై నుంచి కెవడియా మధ్య గల 1709.8 కి.మీలను 27.40 గంటల్లో ప్రయాణిస్తుందన్నారు. అలాగే కెవడియా నుంచి చెన్నై (09120) సూపర్‌ ఫాస్ట్‌ వీక్లీ రైలు ఈనెల 20వ తేదీ బుధవారం కెవడియాలో ఉదయం 9.15 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 11.04 గంటలకు కడపకు చేరుకుని 11.06కు చెన్నైకి బయలుదేరి వెళుతుందని తెలిపారు.

Updated Date - 2021-01-17T05:19:24+05:30 IST