Abn logo
Oct 14 2021 @ 21:56PM

డ్వాక్రా సంఘాలకు చెక్కుల పంపిణీ

పొదుపు గ్రూపు సభ్యులకు చెక్‌ అందజేస్తున్న ఎమ్మెల్యే వెలగపల్లి

చిట్టమూరు, అక్టోబ రు 14 : వైఎస్‌ఆర్‌ ఆస రా వారోత్సవాల్లో భాగం గా గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాద్‌ గు రువారం డ్వాక్రా గ్రూపుల కు చెక్కులు పంపిణీ చే శారు. చిట్టమూరు ఎంపీ డీవో కార్యాలయం వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మండలంలోని 630 డ్వాక్రా గ్రూపుల్లోని 6188 మంది సభ్యులకు రూ.4.42 కోట్లు మంజూరైందని తెలిపారు. ఏపీఎం ఉమాదేవి, మండల వైసీపీ కన్వీనర్‌ సన్నారెడ్డి శ్రీనివాసులురెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వెంకటయ్య, ఎంపీడీవో సురేష్‌బాబు, తహసీల్దార్‌ మునిలక్ష్మి, కస్తూరిరెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బీవీ రమణయ్య, వంకా రమణయ్య పాల్గొన్నారు. 

గూడూరు: స్థానిక సబ్‌కలెక్టర్‌ కార్యాలయ సమీపంలో గురువారం రెండోవిడత వైఎస్సార్‌ ఆసరా చెక్కులను ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే వరప్రసాద్‌రావు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ పొణకా దేవసేన, స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మేరిగ మురళీధర్‌రావు పంపిణీ చేశారు.  ఆర్డీవో మురళీకృష్ణ, కమిషనర్‌ శ్రీకాంత్‌, తహసీల్దారు లీలారాణి, బొమిడి శ్రీనివాసులు, కొండూరు కోదండరామయ్య తదితరులు పాల్గొన్నారు.