కరోనా కట్టడికి చెర్లోపల్లె గ్రామ యువత ముందడుగు

ABN , First Publish Date - 2021-05-18T05:18:17+05:30 IST

మండల పరిధిలోని కరోనా ఉధృత తీవ్రతరం అవుతున్న నేపఽథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి చెర్లోపల్లె యవత ముందడుగు వేసింది.

కరోనా కట్టడికి చెర్లోపల్లె గ్రామ యువత ముందడుగు

చిట్వేలి, మే17 : మండల పరిధిలోని కరోనా ఉధృత తీవ్రతరం అవుతున్న నేపఽథ్యంలో కరోనాను కట్టడి చేయడానికి చెర్లోపల్లె యవత ముందడుగు వేసింది. సోమవారం ఉదయం చెర్లోపల్లె గ్రామ పెద్దల సహకారంతో సోడియం హైపోక్లోరైట్‌ కొనుగోలు చేసి గ్రామం మొత్తం పిచికారీ చేయించారు. దీంతో పాటు బ్లీచింగ్‌ కూడా చల్లారు.  ఈ కార్యక్రమంలో రేషన్‌ డీలర్‌ ఓబినేని వెంకటయ్య, పోతినేని వెంకటరమణ, తుర్రా ఈశ్వరయ్య, ఓబినేని గంగయ్య, చిన్నయ్య, మదిర మణి, మించల బాలకృష్ణ, పోతినేని నారాయణ, పోతినేని సుబ్బరాయుడు, శివరాజు, గ్రామ యువత పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-18T05:18:17+05:30 IST