మంత్రి హరీష్‌రావు ఎక్కడ: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-09T21:16:22+05:30 IST

మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తరలిస్తుంటే మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్నారని దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు.

మంత్రి హరీష్‌రావు ఎక్కడ: చెరుకు శ్రీనివాస్‌రెడ్డి

దుబ్బాక: మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను బలవంతంగా తరలిస్తుంటే మంత్రి హరీష్ రావు ఎక్కడ ఉన్నారని దుబ్బాక కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లన సాగర్ రైతులు వేసిన కోర్ట్ ధిక్కరణ కేసులో కలెక్టర్ ,అడిషనల్ కలెక్టర్‌కి మూడు నెలల జైలు శిక్ష‌తో పాటు జరినామా వేసిందని చెప్పారు. అధికారుల మీద 30 కోర్ట్ ధిక్కరణ కేసులు వేశారన్నారు. ఐఏఎస్ ఆఫీసర్ వద్దకు పోతే ప్రజలు న్యాయం జరుగుతుంది అని భావించేవారని తెలిపారు. 

ఐఏఎస్ వ్యవస్థని టీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు అండగా కాంగ్రెస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే సుప్రీంకోర్ట్‌కి వెళ్తామని చెప్పారు. మల్లన్న సాగర్ బాధితులకు మొత్తం పరిహారం చెల్లించిన తర్వాతే గ్రామాలు ఖాళీ చేయాలన్నారు. శిక్ష పడ్డ కలెక్టర్ అధికారుల ప్లేస్‌లో కొత్త వారిని నియమించాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కలెక్టర్ దగ్గరికి ప్రజలు వెళ్లాలంటే భయపడే పరిస్థితులు తీసుకొచ్చారని చెరుకు శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-03-09T21:16:22+05:30 IST