Aug 3 2021 @ 00:30AM

చెస్‌ క్రీడాకారుడు... షార్ప్‌ మెమరీ ఉన్నోడు!

‘‘అతడు జాతీయస్థాయి చెస్‌ క్రీడాకారుడు. షార్ప్‌ మెమరీ ఉన్నోడు. హిందీ, ఇంగ్లిష్‌, జర్మనీ మాట్లాడతాడు. మిగతా వివరాలు ట్రైలర్‌లో...’’ అంటూ ‘బెల్‌ బాటమ్‌’లో తన పాత్ర గురించి అక్షయ్‌కుమార్‌ వివరించారు. భారత రహస్య గూఢాచారిగా ఆయన వెండితెరపై సందడి చేయనున్న చిత్రం ‘బెల్‌ బాటమ్‌’. మంగళవారం ట్రైలర్‌ విడుదల చేస్తున్నారు. ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. కరోనా కారణంగా ఇప్పటికే పలుమార్లు సినిమా విడుదల వాయిదా పడింది. ఈసారి విడుదల చేయడం ఖాయమని చిత్రవర్గాలు వెల్లడించాయి. త్రీడీలో ‘బెల్‌ బాటమ్‌’ను విడుదల చేస్తున్నారు.