ఛాతీలో మంట చిటికెలో...

ABN , First Publish Date - 2021-03-09T19:16:48+05:30 IST

ఛాతీలో మంట చెప్పలేనంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడే కొందరికి యాంటాసిడ్లు కూడా ఉపశమనాన్ని ఇవ్వలేవు. అయితే ఈ ఇబ్బందిని ఆహారంతోనే తగ్గించుకునే వీలుంది. ఛాతీలో మంటను తగ్గించే ఆ ఆహార పదార్థాలు ఏవంటే!

ఛాతీలో మంట చిటికెలో...

ఆంధ్రజ్యోతి(09-03-2021)

ఛాతీలో మంట చెప్పలేనంత అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడే కొందరికి యాంటాసిడ్లు కూడా ఉపశమనాన్ని ఇవ్వలేవు. అయితే ఈ ఇబ్బందిని ఆహారంతోనే తగ్గించుకునే వీలుంది. ఛాతీలో మంటను తగ్గించే ఆ ఆహార పదార్థాలు ఏవంటే!


అల్లం: జీర్ణాశయాన్ని చల్లబరిచే గుణం అల్లానికి ఉంటుంది. వాపులను తగ్గించే గుణం కూడా కలిగిన అల్లం ఎసిడిటీతో తలెత్తే ఆహారనాళిక ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. కాబట్టి టీలో అర టీస్పూను అల్లం తురుము కలిపి తాగడం వల్ల ఛాతీలో మంటను నివారించుకోవచ్చు.


ఓట్స్‌: వీటిలో ఉండే పీచుపదార్థం అదనంగా ఉత్పత్తయ్యే యాసిడ్‌ను పీల్చుకుని, ఛాతీలో మంటను తగ్గిస్తుంది. అయితే ఎసిడిటీని ప్రేరేపించే వెల్లుల్లి, టొమాటోలతో కలపి ఓట్స్‌ తీసుకోకూడదు.


యాపిల్స్‌: పెక్టిన్‌ అనే నీటిలో కరిగే పీచు ఛాతీలో మంటను తగ్గిస్తుంది. జీర్ణశక్తిని పెంచి, పరోక్షంగా ఎసిడిటీకి అడ్డుకట్టవేసే పెక్టిన్‌ యాపిల్స్‌లో ఎక్కువ. కాబట్టి ఎసిడిటీ సమస్య ఉన్నవారు యాపిల్‌ తింటూ ఉండాలి. యాపిల్స్‌లోని క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం ఖనిజ లవణాలు పొట్టలో యాసిడ్‌ ఉత్పత్తిని తగ్గిస్తాయి. దాంతో ఎసిడిటీ సమస్య ఎదురవదు.


కలబంద: ఈ ఔషధ మొక్క జీర్ణకోశంలోని స్రావాలను క్రమబద్ధం చేస్తుంది.  ఎసిడిటీతో బాధపడేవారు తేనె కలిపిన కలబంద రసాన్ని తాగితే ఉపశమనం పొందుతారు.

Updated Date - 2021-03-09T19:16:48+05:30 IST