Abn logo
Sep 22 2021 @ 03:49AM

హైదరాబాద్‌ మార్కెట్లోకి చేతక్‌ ఈ-స్కూటర్‌

  •  ధర రూ.1,44,175. 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌లో చేతక్‌ ఈ-స్కూటర్‌ బుకింగ్స్‌ను బజాజ్‌ ఆటో ప్రారంభించింది. బెంగళూరు, చెన్నై, పుణే సహా ఇప్పటి వరకూ ఏడు నగరాల్లో చేతక్‌ ఈ-స్కూటర్‌ ను విడుదల చేశామని.. ఆయా నగరాల్లో లభించిన స్పందన స్థాయిలోనే హైదరాబాద్‌లో కూడా స్పందన వస్తుందని భావిస్తున్నట్లు బజాజ్‌ ఆటో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ శర్మ తెలిపారు. హైదరాబాద్‌లోని కొన్ని డీలర్‌షిప్‌ షోరూమ్‌ల వద్ద స్కూటర్‌ను ప్రదర్శనకు ఉంచుతారు. రూ.2,000 చెల్లించి www.chetak.com   వెబ్‌సైట్‌లో స్కూటర్‌ను బుక్‌ చేసుకోవచ్చు. స్కూటర్‌ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.1,44,175. బ్యాటరీ 5 గంటల్లో పూర్తిగా చార్జింగ్‌ అవుతుంది. ఒకసారి చార్జింగ్‌తో 90 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది. బ్యాటరీకి 3 ఏళ్లు లేదా 50,000 కిలోమీటర్ల వరకూ వారెంటీ ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 12,000 కిలోమీటర్ల ప్రయాణం లేదా ఒక ఏడాది తర్వాత సర్వీసింగ్‌ చేయాల్సి ఉంటుంది.