చేతన్‌ చౌహాన్‌కు కరోనా

ABN , First Publish Date - 2020-07-13T09:07:04+05:30 IST

భారత క్రికెట్‌ మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ (72)కు కరోనా వైరస్‌ సోకింది. ఆయన అనారోగ్యంతో లఖ్‌నవ్‌లోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో ...

చేతన్‌ చౌహాన్‌కు కరోనా

లఖ్‌నవ్‌: భారత క్రికెట్‌ మాజీ ఓపెనర్‌ చేతన్‌ చౌహాన్‌ (72)కు కరోనా వైరస్‌ సోకింది. ఆయన అనారోగ్యంతో లఖ్‌నవ్‌లోని సంజయ్‌ గాంధీ ఆస్పత్రిలో శుక్రవారం చేరాడు. అక్కడ కొవిడ్‌ పరీక్ష చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో అతడి కుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు నిర్వహించి హోమ్‌ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా వైద్యులు సూచించారు. 70వ దశకంలో సునీల్‌ గవాస్కర్‌-చేతన్‌ జోడీ విజయవంతమైన ఓపెనింగ్‌ ద్వయంగా పేరు తెచ్చుకొంది. గవాస్కర్‌తో కలిసి పదికి పైగా శతక భాగస్వామ్యాలను అతడు నమోదు చేశాడు. భారత్‌కు 40 టెస్టుల్లో ప్రాతినిథ్యం వహించిన చేతన్‌ 31 సగటుతో 2084 పరుగులు సాధించాడు. ఇక, చాలాకాలంగా రాజకీయాల్లో ఉంటున్న చేతన్‌ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ సర్కార్‌లో మంత్రి గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Updated Date - 2020-07-13T09:07:04+05:30 IST