Abn logo
Nov 11 2020 @ 08:57AM

మాజీ క్రికెటర్ భార్య బీజేపీ ఎమ్మెల్యేగా విజయఢంకా

Kaakateeya

లక్నో (ఉత్తర్ ప్రదేశ్): ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ క్రికెటర్ భార్య బీజేపీ బరిలోకి దిగి ఘన విజయం సాధించారు. మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ భార్య సంగీతా చౌహాన్ నవేగాన్ సాదత్ అసెంబ్లీ స్థానం నుంచి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.61 ఏళ్ల సంగీత 20వేల ఓట్లతో విజయం సాధించారు. సంగీత గతంలో బ్యాంకరుగా, హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు. 29 ఏళ్ల పాటు బ్యాంకరుగా సేవలందించిన సంగీత తన భర్త తోకలిసి  బీజేపీ కోసం పనిచేశారు.తన భర్త మరణించినా తనతోనే ఉన్నాడని, తనకు మద్ధతు ఇచ్చి గెలిపించిన నవేగాన్ సాదత్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఆశయాల కనుగుణంగా తాను అభివృద్ధి కోసం పనిచేస్తానని సంగీత హామీ ఇచ్చారు. మాజీ క్రికెటర్ అయిన చేతన్ చౌహాన్ కరోనాతో మరణించారు. అర్జునఅవార్డు గ్రహీత అయిన చేతన్ టెస్టు మ్యాచ్ లలో పాల్గొన్నారు.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement