సయాటికా నొప్పి ఎందుకు?

ABN , First Publish Date - 2021-06-01T05:30:00+05:30 IST

జీర్ణసంబంధ సమస్యలతో ముడిపడి ఉన్న ఇబ్బందుల్లో సయాటికా నొప్పి ఒకటి. రక్తం తగ్గడం, కాళ్ల వాపులు కూడా జీర్ణసంబంధ సమస్యల్లో కనిపించే లక్షణాలే! ఈ సమస్యలు తగ్గాలంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి...

సయాటికా నొప్పి ఎందుకు?

జీర్ణసంబంధ సమస్యలతో ముడిపడి ఉన్న ఇబ్బందుల్లో సయాటికా నొప్పి ఒకటి. రక్తం తగ్గడం, కాళ్ల వాపులు కూడా జీర్ణసంబంధ సమస్యల్లో కనిపించే లక్షణాలే! ఈ సమస్యలు తగ్గాలంటే ఆహారాన్ని నెమ్మదిగా నమిలి మింగాలి. తీసుకున్న ఆహారం రసంగా మారే వరకూ నమలడం ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. అరగని ఆహారం వల్ల చిన్న. పెద్ద పేగుల్లో గ్యాస్‌ ఏర్పడుతుంది. అది వెలువడకుండా మిగిలిపోయినప్పుడు వెన్ను మీద ఒత్తిడి పెరిగి కాళ్లకు జరిగే రక్తప్రసారంలో అంతరాయం ఏర్పడుతుంది. దాంతో కాళ్ల నొప్పులు, వాటి వల్ల రక్తపోటు పెరుగుతూ ఉంటుంది.


గులాబీ పుష్ప లేహ్యం!

ఈ కోవకు చెందినవాళ్లు ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినడం, ఉదయం నిద్ర లేచింది మొదలు రాత్రి నిద్రకు ముందు వరకూ వేడి నీళ్లు తాగడం, ఎప్పటికప్పుడు విరేచనం సాఫీగా జరిగేలా చూసుకోవడం చేయాలి. భోజనం తర్వాత గులాబీ రేకులతో చేసిన గుల్బంద్‌ లేదా రోజా పుష్ప లేహ్యం వంటి మూలికా సంబంధమైన ఔషధాలు తీసుకుంటే విరేచనం సాఫీగా జరుగుతుంది. దాంతో సయాటికా నొప్పి కూడా తగ్గుతుంది.

- జి. శశిధర్‌, 

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, చీరాల.


Updated Date - 2021-06-01T05:30:00+05:30 IST