చూయింగ్‌ గమ్‌తో బరువుకు చెక్‌!

ABN , First Publish Date - 2020-02-11T21:15:39+05:30 IST

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చూయింగ్ గ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందట. ఆక‌లిగా ఉన్న వారు చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌.

చూయింగ్‌ గమ్‌తో బరువుకు చెక్‌!

బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి చూయింగ్ గ‌మ్ ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుందట. ఆక‌లిగా ఉన్న వారు చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌. ఈ విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. చూయింగ్ గ‌మ్‌ను తిన‌డం వ‌ల్ల ఒత్తిడి త‌గ్గుతుంద‌న్న విషయం గతంలో నిర్వహించిన పలు పరిశోధనల్లో స్పష్టమైంది. టెన్ష‌న్‌, ఆందోళ‌న‌, ఒత్తిడిగా ఉన్న‌ సమయంలో చూయింగ్ గ‌మ్‌ను తింటే వెంట‌నే ఆ ప‌రిస్థితి నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చ‌ని పరిశోధకులు అంటున్నారు. చూయింగ్ గ‌మ్‌ల‌ను తిన‌డం వ‌ల్ల మెద‌డు ప‌నితీరు పెరుగుతుంద‌నీ, ఏకాగ్ర‌తగా ప‌నిచేస్తార‌ని 2004లో చేసిన ప‌రిశోధ‌న‌ల్లో వెల్ల‌డైంది. అలాగే ఆక‌లిగా ఉన్న సమయంలో చూయింగ్ గ‌మ్‌ను తింటే ఆక‌లి చ‌చ్చిపోతుంద‌ట‌. అందువ‌ల్ల ఆహారం త‌క్కువ‌గా తీసుకుంటారు. ఫ‌లితంగా శ‌రీరానికి అందే క్యాల‌రీలు కూడా త‌గ్గుతాయి. దీంతో అధిక బ‌రువు త‌గ్గుతారు. కాకపోతే ఈ విషయం మీద ఇంకా పరిశోధనలు నిర్వహించాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు. 

Updated Date - 2020-02-11T21:15:39+05:30 IST