‘నర్సీపట్నం’లో 16,580 మందికి ‘చేయూత’

ABN , First Publish Date - 2021-06-23T05:16:50+05:30 IST

నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌ చేయూత పథకం కింద 16,580 మంది మహిళలకు రూ.30.95 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు.

‘నర్సీపట్నం’లో 16,580 మందికి ‘చేయూత’
లబ్ధిదారులకు నమూనా చెక్కు అందజేస్తున్న ఎమ్మెల్యే గణేశ్‌

ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌

లబ్ధిదారులకు రెండో విడత చెక్కు పంపిణీ


నర్సీపట్నం, జూన్‌ 22: నర్సీపట్నం నియోజకవర్గంలో వైఎస్సార్‌ చేయూత పథకం కింద 16,580 మంది మహిళలకు రూ.30.95 కోట్లు మంజూరు చేసినట్టు ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్‌గణేశ్‌ తెలిపారు. మంగళవారం స్థానిక ఎన్టీఆర్‌ మినీస్టేడియంలో రెండో విడత వైఎస్సార్‌ చేయూత పథకం ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ, 45 నుంచి 60 సంవత్సరాలలోపు వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం మహిళలకు చెక్కుని అందజేశారు. ఈ కార్యకక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఆదిలక్ష్మి, వైస్‌చైర్మన్‌ గొలుసు నర్సింహమూర్తి, మాజీ వైస్‌చైర్మన్‌ చింతకాయల సన్యాసిపాత్రుడు, కమిషనర్‌ కనకారావు, వైసీపీ పట్టణ అధ్యక్షుడు కోనేటి రామకృష్ణ, శెట్టి మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-23T05:16:50+05:30 IST