'ఛత్రపతి' హిందీ రీమేక్ లేటెస్ట్ అప్‌డేట్..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వచ్చిన 'ఛత్రపతి' సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో దర్శకుడిగా రాజమౌళికి, హీరోగా ప్రభాస్‌కు భారీగా క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఇదే సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు మన టాలీవుడ్ యంగ్ హీరో మరియు స్టార్ డైరెక్టర్. వారే బెల్లంకొండ సాయి శ్రీనివాస్, వివి వినాయక్. ఇద్దరికీ ఈ సినిమా బాలీవుడ్‌లో డెబ్యూ మూవీనే. ఎప్పుడో మొదలైన ఈ సినిమా గురించి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోవడంతో అసలు షూటింగ్ జరుగుతుందా లేదా అని సందేహాలు మొదలయ్యాయి. దాంతో తాజాగా ఛత్రపతి హిందీ రీమేక్ మూవీకి సంబంధించిన ఓ అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ వైజాగ్‌లో జరుగుతోంది. దర్శకుడు వివి వినాయక్.. హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు. దీనికి సంబంధించిన లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది.  

Advertisement