ఆదర్శం: రెంగనార్ గ్రామంలో అర్హులందరికీ కొవిడ్ టీకాలు

ABN , First Publish Date - 2021-06-18T11:18:22+05:30 IST

ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా రెంగనార్ గిరిజన గ్రామంలో అర్హులందరూ కొవిడ్....

ఆదర్శం: రెంగనార్ గ్రామంలో అర్హులందరికీ కొవిడ్ టీకాలు

రాయపూర్ : ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా రెంగనార్ గిరిజన గ్రామంలో అర్హులందరూ కొవిడ్ టీకాలు వేయించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. గిరిజన గ్రామమైన రెంగనార్ లో జూన్ 16వతేదీకల్లా అర్హులందరూ కరోనా టీకాలు మొదటి డోసు వేయించుకున్నారని అధికారులు ప్రకటించారు. ఆరోగ్య సిబ్బంది నిరంతర కృషి వల్ల రెంగనార్ గ్రామం కరోనా వైరస్ మహమ్మారికి వ్యతిరేకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమంలో విజయం సాధించిందని అధికారులు చెప్పారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర రాజధాని నగరమైన రాయ్ పూర్ కు 420 కిలోమీటర్ల దూరంలోని రెంగనార్ గ్రామంలో 310 మంది పెద్దలుండగా, వారిలో అర్హులైన 294 మంది కొవిడ్ టీకాలు వేయించుకున్నారు. 





కరోనా వైరస్ నివారణకు టీకాలు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తాయని ఆరోగ్య కార్యకర్తలు గ్రామస్థులకు అవగాహన కల్పించడంతో వారు ముందుకు వచ్చి టీకాలు వేయించుకున్నారు. ఇంటింటికి వెళ్లి తాము టీకాలు వేయించుకోవాలని కోరడంతో ప్రజలు స్పందించారని రెంగనార్ గ్రామ ప్రతినిధి సంమతి తెలమి చెప్పారు.

Updated Date - 2021-06-18T11:18:22+05:30 IST