Advertisement
Advertisement
Abn logo
Advertisement

భర్తతో కలిసి సొంతూరికి NRI.. రాత్రిపూట ఇంటి ముందే షాకింగ్ ఘటన..

చండీఘర్: భర్తతో కలిసి సొంతూరికి వచ్చారు ఓ ఎన్నారై. సాయంత్రం సమయంలో ఆహ్లాదంగా ఉంటుందని బయటకు వచ్చి నిలబడ్డారు. ఎదురింటి మహిళ కనపడడంతో మాటలు కలిపారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు వ్యక్తులు బైక్‌పై మెరుపు వేగంతో వచ్చి ఆ ఎన్నారై మెడలోని చైన్ తెంపుకొనిపోయారు. హఠాత్తుగా జరిగిన ఈ ఘటనతో ఆమె నివ్వెరపోయారు. రాత్రి పూట కావడం, బైక్ వేగంగా వెళ్లిపోవడంతో కనీసం ఆ బైక్ నెంబర్ కూడా ఆమె చూడలేకపోయారు. ఈ ఘటన పంజాబ్‌లోని ఖరార్ ప్రాంతంలో బుధవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 40 ఎళ్ల ఎన్నారై గుర్ప్రీత్ సింగ్.. ఇటీవల తన సొంతూరు ఖరార్‌కు భర్తతో కలిసి వచ్చారు. స్థానిక సన్నీ ఎన్‌క్లేవ్‌లో దిగారు. బుధవారం రాత్రి సమయంలో బయట తిరుగుతుండగా ఎదురింటి మహిళ కూడా బయటకు రావడంతో ఇద్దరూ మాటల్లో పడ్డారు. ఈ క్రమంలోనే ఇద్దరు చైన్ స్నాచర్లు బైక్‌పై వేగంగా వచ్చి గుర్ప్రీత్ కౌర్ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే ఆ దుండగులు కనిపించనంత దూరం వెళ్లిపోయారు.

దొంగతనం జరిగిన వెంటనే గుర్ప్రీత్ కౌర్ పోలీసులను ఆశ్రయించారు. అయితే చీకటిలో బైక్ నెంబర్ కూడా చూడలేకపోయానని, బైక్‌పై ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు మాత్రం చెప్పగలనని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమలోనే కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement