దారుణంగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ @ రూ.100..

ABN , First Publish Date - 2020-02-22T20:58:55+05:30 IST

కరోనా వైరస్‌ వదంతులతో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర పడిపోతోంది. పక్షం రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న చికెన్‌ ధర శుక్రవారం మరింత పతనమైంది. శనివారం మార్కెట్‌లో కిలో లైవ్‌ ధర రూ.60,

దారుణంగా పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ @ రూ.100..

కోడి మాంసం తింటే కరోనా వైరస్‌ సోకుతుందనే ప్రచారంతో పడిపోయిన అమ్మకాలు


విశాఖపట్నం: కరోనా వైరస్‌ వదంతులతో బ్రాయిలర్‌ కోడి మాంసం ధర పడిపోతోంది. పక్షం రోజుల నుంచి తగ్గుతూ వస్తోన్న చికెన్‌ ధర శుక్రవారం మరింత పతనమైంది. శనివారం మార్కెట్‌లో కిలో లైవ్‌ ధర రూ.60, విత్‌ స్కిన్‌ రూ.90, స్కిన్‌లెస్‌ రూ.100గా పరిశ్రమ నిర్ణయించింది. చైనాలో మొదలైన కరోనా వైరస్‌ కోళ్ల పరిశ్రమను అతలాకుతలం చేస్తోంది. కోడి మాంసం తింటే కరోనా వైరస్‌ సోకుతుందని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో ప్రజలు దీనికి దూరంగా ఉంటున్నారు. గడిచిన 15 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఉత్తరాదితో పోల్చితే కరోనా వైరస్‌ వదంతులు దక్షిణాది రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపాయి. ఫలితంగా చికెన్‌కుడిమాండ్‌ లేకుండా పోయింది. హోటళ్లలో కూడా చికెన్‌ ఆర్డర్లు తక్కువగా ఉంటున్నాయి. దీంతో హోటళ్లు కూడా చికెన్‌ కొనుగోలు బాగా తగ్గించాయి. 


కరోనా వైరస్‌ ప్రచారానికి ముందు సాధారణ రోజుల్లో నగరంలో రోజుకు లక్షా పాతిక వేల కిలోలు, ఆదివారం రెండున్నర లక్షల కిలోలు చికెన్‌ విక్రయాలు జరిగేవి. ఇప్పుడు సాధారణ రోజుల్లో 50 వేల కిలోలు, ఆదివారం లక్ష కిలోలకు మించి వ్యాపారం జరగడం లేదని మార్కెట్‌ వర్గాలు పేర్కొం టున్నాయి. విశాఖ నగరంలోనే కాకుండా కోస్తా, రాయలసీమ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల్లో కూడా చికెన్‌ అమ్మకాలు పడిపోయాయి. దీంతో కోళ ్ల రైతులు బెంబేలెత్తిపోతున్నారు. ఈనెల మొదటి వారంలో కిలో ధర రూ.154 వుండగా ఇప్పుడు రూ.100కు పడిపోయింది. అయినా డిమాండ్‌ లేదు. 


రాష్ట్ర విభజన జరిగిన తొలినాళ్లలో ఇలాగే చికెన్‌ ధరలు ఒక్కసారిగా పడిపోయినా రెండు, మూడు రోజుల్లోనే తిరిగి పెరిగాయని రైతులు గుర్తుచేసుకుంటున్నారు. అందువల్ల అప్పుడు పెద్దగా నష్టపోలేదన్నారు. దానికి భిన్నంగా ఇప్పుడు ఇరవై రోజులుగా చికెన్‌ ధర తగ్గుతూ శుక్రవారం నాటికి కిలో వంద రూపాయలకు పడిపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆందోళన వ్యక్తంచేశారు. కాగా చికెన్‌ తింటే కరోనా వైరస్‌ సోకుతుందనేది కేవలం వదంతి మాత్రమేనని విజయనగర హేచరీస్‌ ఎండీ డాక్టర్‌ గాంధీరెడ్డి స్పష్టంచేశారు. కరోనా వైరస్‌ అతి శీతల వాతావరణంలో మాత్రమే వ్యాప్తిచెందుతుందని, మన రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలకు పైబడి నమోదవుతున్న విష యాన్ని గుర్తించాలన్నారు. అందువల్ల కోళ్లకు ఎటువంటి వైరస్‌ సోకదన్నారు. సోషల్‌ మీడియాలో వదంతులు నమ్మ వద్దని కోరారు. కాగా చికెన్‌ ధరలు తగ్గినందున రిటైల్‌ వ్యాపారులు అదే ధరకు వినియోగదారులకు విక్రయిం చాలని బ్యాగ్‌ అధ్యక్షుడు టి.ఆదినా రాయణ కోరారు. నగరంలో స్కిన్‌లెస్‌ కిలో రూ.100గా నిర్ణయించినందున అదే ధరకు అమ్మకాలు చేపట్టాలన్నారు. 

Updated Date - 2020-02-22T20:58:55+05:30 IST