ఆలయంలో Diwali celebrationకు పాక్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్

ABN , First Publish Date - 2021-11-08T14:29:05+05:30 IST

మైనారిటీ హిందూ సమాజానికి సంఘీభావం తెలపడానికి వీలుగా పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ ప్రాంతంలోని తేరీ ఆలయంలో...

ఆలయంలో Diwali celebrationకు పాక్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్

ఇస్లామాబాద్: మైనారిటీ హిందూ సమాజానికి సంఘీభావం తెలపడానికి వీలుగా పాకిస్తాన్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కరక్ ప్రాంతంలోని తేరీ ఆలయంలో జరగనున్న దీపావళి వేడుకల్లో పాల్గొననున్నారు. ఈ దేవాలయంపై గత సంవత్సరం కొంతమంది దుండగులు దాడి చేసి కూల్చివేశారు.పాక్ ప్రధాన న్యాయమూర్తి గుల్జార్ అహ్మద్ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు దీపావళి వేడుకలో పాల్గొంటారని పాక్ హిందూ కౌన్సిల్ విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆలయం ఒక సాధువు శ్రీ పరమ హన్స్ జీ మహారాజ్ మందిరం. ఈ ఆలయాన్ని 1920 సంవత్సరంలో నిర్మించారు.


గత ఏడాది డిసెంబరులో జమియత్ ఉలేమా ఇస్లాం-ఫజల్‌కు చెందిన స్థానిక మతగురువు నేతృత్వంలోని గుంపు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసింది. ఆలయ సమీపంలో జరిగిన జమియాత్ ఉలేమా ఇస్లాం-ఫజల్ ర్యాలీ తర్వాత ఈ సంఘటన జరిగింది. కూల్చివేసిన ఈ మందిరాన్ని పునరుద్ధరించాలని గతంలో సీజేపీ గుల్జార్ అహ్మద్ ఆదేశించారు. గత నెలమందిరాన్ని ధ్వంసం చేసిన నిందితుల నుంచి రూ.33 మిలియన్లను (పాకిస్థానీ రూపాయలు) రికవరీ చేయాలని ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రభుత్వాన్ని గుల్జార్ అహ్మద్ ఆదేశించారు.


Updated Date - 2021-11-08T14:29:05+05:30 IST