మీ ఆదేశాలతో దేశానికి ఆక్సిజన్‌

ABN , First Publish Date - 2021-06-09T07:04:35+05:30 IST

సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి ఎన్వీ రమణకు ఓ అరుదైన లేఖ అందింది. కొవిడ్‌ కేసులు, మరణాలను తగ్గించడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న కృషిని అభినందిస్తూ సీజే కార్యాలయానికి ఐదో తరగతి విద్యార్థిని ఈ లేఖ పంపారు. తాను స్వయంగా గీసిన బొమ్మను

మీ ఆదేశాలతో దేశానికి ఆక్సిజన్‌

చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణకు కేరళ విద్యార్థిని లేఖ థ్యాంక్స్‌ సీజే సార్‌!


న్యూఢిల్లీ, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు ప్రధాన న్యా యమూర్తి ఎన్వీ రమణకు ఓ అరుదైన లేఖ అందింది. కొవిడ్‌ కేసులు, మరణాలను తగ్గించడానికి దేశ సర్వోన్నత న్యాయస్థానం చేస్తున్న కృషిని అభినందిస్తూ సీజే కార్యాలయానికి ఐదో తరగతి విద్యార్థిని ఈ లేఖ పంపారు. తాను స్వయంగా గీసిన బొమ్మను లేఖకు జతచేశారు. ఇంత చిన్నవయసులోనే సామాజిక అంశాలపై స్పందిస్తున్న ఆమె తీరును చీఫ్‌ జస్టిస్‌ రమణ మెచ్చుకొన్నారు. కొవిడ్‌ కట్టడికి సంబంధించి గత నెల చివర్లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలు.. 18 ఏళ్లు దాటిన వారికి టీకాలు ఉచితంగా కేంద్రం అందిస్తుందా లేదా అనే చర్చకు దారితీశాయి. కేరళలోని త్రిశూర్‌ కేంద్ర విద్యాలయ విద్యార్థిని లిడ్వినా జోసఫ్‌ ఈ సమయంలోనే తన చేతిరాతతో చీఫ్‌ జస్టిస్‌ రమణకు లేఖ రాశారు. ‘కొవిడ్‌ వల్ల ఢిల్లీ, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వినిపించే మరణవార్తలు నన్ను కలవరపరిచేవి. ఆక్సిజన్‌ సరఫరాపై సకాలంలో ఆదేశాలిచ్చి ఎందరి ప్రాణాలో కాపాడిన న్యాయస్థానాన్ని చూసి గర్వపడుతున్నాను. సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా మీకు ధన్యవాదాలు’’ అని లిడ్వినా పేర్కొన్నారు. 


తెలుగు లేఖకు సీజేఐ పులకింత

విజయవాడ యువకుడు తెలుగులో రాసిన లేఖకు జస్టిస్‌ ఎన్‌వీ రమణ పులకించిపోయారు. ఆ యువకుడికి తెలుగులో తిరుగు లేఖ రాశారు. విజయవాడ వాసవీ నగర్‌కు చెందిన పొట్లూరి దర్శిత్‌ అమరావతి రైతు ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.


అందమైన లేఖ అందుకొన్నా: రమణ

‘‘అందమైన లేఖనూ, న్యాయమూర్తిని హృద్యం గా చిత్రీకరించిన డ్రాయింగ్‌నూ అందుకొన్నాను’’ అంటూ లిడ్వినా జోసఫ్‌ లేఖకు సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ ప్రత్యుత్తరమిచ్చారు. తన సంతకంతో రాజ్యాంగ ప్రతిని ఆ లేఖకు జతచేసి బహుమానంగా పంపారు. కాగా, కోర్టులో న్యాయమూర్తి తన చేతిలోని సుత్తితో కొవిడ్‌ను బాదుతున్నట్టున్న కలర్‌ డ్రాయింగ్‌ ఇది. ఆయన కూర్చు న్న బల్లపై ఒకవైపు త్రివర్ణ పతాకం, రెండోవైపు రాజముద్ర, గోడపై మహ్మాతుని చిత్రం ఉన్నాయి. 

Updated Date - 2021-06-09T07:04:35+05:30 IST