ముఖ్యమంత్రి క్షీరక్రాంతి మూత

ABN , First Publish Date - 2022-01-18T04:10:43+05:30 IST

జిల్లాలో వెనుకబడిన పశ్చిమప్రాంతంలో మహిళల జీవనోపాధి కోసం 2008లో అప్పటి ప్రభుత్వ హయాంలో జిల్లాలోనే ప్రథమంగా బేస్తవారపేట మండలంలో ముఖ్యమంత్రి క్షీరక్రాంతి పథ కంను ప్రవేశపెట్టారు.

ముఖ్యమంత్రి క్షీరక్రాంతి మూత
మూసివేసి ఉన్న పాలశీతల కేంద్రం



రోడ్డునపడిన ఉద్యోగులు

నీరుగారిన లక్ష్యం

ఉపాధి కోల్పోయిన మహిళలు

బేస్తవారపేట, జనవరి 17 : జిల్లాలో వెనుకబడిన పశ్చిమప్రాంతంలో మహిళల జీవనోపాధి కోసం 2008లో అప్పటి ప్రభుత్వ హయాంలో జిల్లాలోనే ప్రథమంగా బేస్తవారపేట మండలంలో ముఖ్యమంత్రి క్షీరక్రాంతి పథ కంను ప్రవేశపెట్టారు. హైదరాబాద్‌ ఎస్‌ఈఆర్‌ఐ సహకారంతో బల్క్‌ మి ల్క్‌ యూనిట్‌ సెంటర్‌ను అప్పటి ఆర్థిక మంత్రి కొణిజేటి రోషయ్య ఈ యూనిట్‌ను ఇక్కడ ప్రారంభించారు. అనంతరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఇందిర క్రాంతి పథం ద్వారా మండల మహిళా సమైక్య ఆధ్వర్యంలో పాలశీతల కేంద్రం నడిచింది. లక్షల రూపాయలు వెచ్చించి 5 వేల లీటర్ల పాలను చిల్లింగ్‌ చేసే యూనిట్‌, కంప్యూటర్‌, పాల క్యాన్లు తదితర సా మగ్రిని సమకూర్చారు. మండలంలోని మహిళా సమైక్య గ్రూపులు 20 యూనిట్లు వివిధ గ్రామాల్లో రైతుల నుంచి పాలను సేకరించేవారు. రోజు కు 3వేల లీటర్ల పాలను చిల్లింగ్‌ సెంటర్‌కు తరలించేవారు. కంభం, పిటికాయగుళ్ల స్టేట్‌ బ్యాంకుల నుంచి పాల ఉత్పత్తిదారులకు రుణసదుపాయం, ప్రభుత్వం నుంచి పశు పోషకులకు ఉచిత దానా అందేది.  నిత్యం వేల సంఖ్యలో పాల సరఫరా సాగేది. అనంతరం ముఖ్యమంత్రి క్షీరక్రాంతి యూనిట్‌పై అధికారుల దృష్టి, ఆదరణ తగ్గిపోయింది. అదే క్రమంలో మం డలంలో మూడు ప్రైవేటు పాల డెయిరీలు ఏర్పాటయ్యాయి. ప్రైవేటు డెయిరీ నిర్వాహకులు పాల ధరను పెంచి సేకరణ స్థాయిని పెంచారు. ఆ కారణంగా మహిళలు నిర్వహిస్తున్న మిల్క్‌బల్క్‌ కేంద్రం ఆదరణ కోల్పోయి మూడేళ్ల నుంచి మూతపడింది.   ఈ డెయిరీలో పనిచేసిన మేనేజర్‌, ఇద్ద రు సూపర్‌వైజర్లు, ఎలక్ర్టీషియన్‌, వాచ్‌మన్‌, స్వీపర్లు, డెయిరీని నడిపే మ హిళలంతా ఒక్కసారిగా రోడ్డున పడ్డారు.  

మూడేళ్లుగా అద్దె ఇవ్వలేదు 

-  గురువారెడ్డి, భవన యజమాని

అప్పటి ప్రభుత్వం మహిళల ఉపాధి కోసం పాలశీతల కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందుకోసం అద్దెకు భవనం తీసుకొని డెయిరీని ని ర్వహించింది. భవనం కావాలంటే అప్పటికప్పుడు నిర్మించి అద్దెకు ఇచ్చాను. మూడేళ్లుగా డెయిరీని మూసివేశారు. అ ప్పటి నుంచి నాకు అద్దె కూడా చె ల్లించలేదు. అద్దె చెల్లించాలని అధికారులను కోరగా మాకు సం బంధం లేదని సమాధానం చెప్పారు.  భవనంలో ఉన్న సామగ్రిని తీసి రో డ్డున పడే ద్దామంటే అవి లక్షలాది రూపాయల విలువ చేసేవి. దీంతో ఏం చేయాలో అర్ధం కావడంలేదు. అధికారులు స్పందించి డెయిరీ నిర్వహణకు చర్యలు తీసుకోవడమో లేక భవనంలో ఉన్న చిల్లింగ్‌ సామగ్రిని వేరే చోటుకు మార్చి బిల్డింగ్‌ను ఖాళీ చేయాలి.   

జిల్లా అధికారులకు తెలియజేశాం

- తోట లక్ష్మి, డెయిరీ మేనేజర్‌ 

గతంలో డెయిరీ బాగా నడిచేది. మహిళలు పాల సేకరణ చేసి జీవనోపాధిని పొందేవారు. రానురాను గ్రామాల్లో పాలసేకరణ చేయడంలో గ్రూ పులకు అలసత్యం ఏర్పడింది. దీంతో డెయిరీ ఆధ్వర్యంలో ఉన్న వైద్యులు, ఏపీఎంలను వెలుగు ప్రాజెక్టుకు బదిలీ చేశారు. తనతోపాటు మరో ఆరు గురు సిబ్బందికి నేటికీ జీతాలు లేవు. పాలకేంద్రాన్ని మూసివేశారు. భవ నంలో లక్షల విలువ చేసే సామగ్రి ఉంది. జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చాం. అయినా పట్టించుకోవడం లేదు. 


Updated Date - 2022-01-18T04:10:43+05:30 IST