వరద ప్రాంతాల్లో 2 రోజులు సీఎం పర్యటన

ABN , First Publish Date - 2021-12-02T08:40:16+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. గురువారం కడప జిల్లా

వరద ప్రాంతాల్లో 2 రోజులు సీఎం పర్యటన

నేడు అన్నమయ్య డ్యాంకు..


కడప(ఆంధ్రజ్యోతి), రాజంపేట, డిసెంబరు 1: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజులు పర్యటించనున్నారు. గురువారం కడప జిల్లా రాజంపేటకు సీఎం రానున్నారు. కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ దగ్గరుండి ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం వస్తుండడంతో రాజంపేటలోని వరద బాధిత గ్రామాల్లో సహాయక చర్యలు యుద్ధప్రాతిపతికన చేపట్టారు. రోడ్లను శుభ్రం చేశారు. బాధితుల కోసం జర్మన్‌ షెడ్లు వేశారు. ఉదయం 10.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు సీఎం చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నవోదయ విద్యాలయం వద్ద ఏర్పాటుచేసిన హెలిప్యాడ్‌కు 10.50 గంటలకు చేరుకుంటారు. అక్కడినుంచి పులపత్తూరు చేరుకొని బాధితులతో మాట్లాడతారు. అనంతరం మందపల్లెలో పర్యటిస్తారు. ఎగువమందపల్లెలో బాధితులతో మాట్లాడతారు. మధ్యాహ్నం 1.30 గంటలకు అన్నమయ్య డ్యాంను పరిశీలిస్తారు. తర్వాత జిల్లా, డివిజన్‌, మండల అధికారులతో వరద సాయంపై సమీక్ష నిర్వహిస్తారని కడప కలెక్టర్‌ విజయరామరాజు తెలిపారు. తర్వాత చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తారు.

Updated Date - 2021-12-02T08:40:16+05:30 IST