రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-07-30T05:22:19+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనా రాయణ విమర్శించారు.

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌
సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణ

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ 

ఓదెల, జూలై 29 : ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనా రాయణ విమర్శించారు. మండలంలోని కనగర్తిలో గురువారం మండల స్థాయి బీజేపీ కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షు డు శనిగరపు రమేష్‌ అధ్యక్షతన నిర్వహించారు. దీనికి సోమా రపు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి లు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం అప్పుడు రూ.40వేల కోట్లు ఖర్చు అనుకుంటే రూ.లక్షా 20వేల కోట్ల మే రకు ఖర్చుపెటి కేసీఆర్‌ చేతులు దులుపుకు న్నారని, ఇందులో కమీషన్లు పొంది ఎన్నిక ల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ ధనిక రాష్ట్రమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌ దారిద్య్రంలో ఉందని, ఇపుడు ఏపీకంటే తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబి లోకి దిగజారిందన్నారు. ఉన్న భూములను బినామీ కంపెనీలకు అప్పజెప్పి మిగులు భూములన్ని అ మ్ముకుంటున్న సీఎం కేసీఆర్‌ను నిలుపుదల చేయా ల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమ సమయంలో ఈటల రాజేందర్‌ వద్ద ఐదు, పది లక్షలు అడుక్కు న్న కేసీఆర్‌కు ఇపుడు వేలకోట్లు ఎక్కడివని తెలిపా రు. అందుకే రాష్ట్రంలో బీజేపీ పాలనలోకి రావాలంటే సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.  మాజీఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కేసీఆర్‌ ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడంలేదని, వందలాది కోట్లను హుజురాబాద్‌కు పంపిస్తున్నారని తెలిపారు. అనంత రం పలు గ్రామాలకు చెందిన యువకులు బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ పిన్నింటి రాజు, ప్రధాన కార్యదర్శి కర్రె సంజీవరెడ్డి, మీస అర్జున్‌రావు, కన్నం అంజయ్య, వివిధ మండలాల అధ్యక్షులు, మండలంలోని బీజే పీ, బీజేవైఎం నాయకులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-07-30T05:22:19+05:30 IST