Abn logo

చికెన్ పకోడా (వీడియో)

తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో చికెన్ తీసుకుని అందులో తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, తగినంత కారం, ఒక స్పూన్ ధనియాపొడి, గరం మసాలా, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు, కొద్దిగా నిమ్మరసం, ఒక గుడ్డు, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి.


ఆ మిశ్రమాన్ని పదిహేను నిమిషాలపాటు పక్కన పెట్టుకోవాలి. ఇపుడు బాణీలో సగం వరకు నూనె పోసి బాగా మరగనివ్వాలి. ముందు కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటి వేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి. తరువాత ఒక గిన్నెలోకి తీసుకుని కొత్తిమీర, నిమ్మకాయతో గార్నిష్ చేసుకుంటే ఈ వర్షకాలంలో చికెన్ పకోడా బాగా ఎంజాయ్ చేయొచ్చు.

మటన్‌ కీమా బాల్స్ఎగ్ వడఎగ్‌రోల్‌ఎగ్‌ ఫింగర్స్‌కబాబ్స్‌ఎగ్‌ 65మ్యాంగో క్రంబ్‌ బార్స్‌చందువా చేపల ఫ్రైచంద్రవంకలుక్యారెట్‌ కుక్కీస్‌
Advertisement
d_article_rhs_ad_1
Advertisement