చిక్కంతా దానితోనే

ABN , First Publish Date - 2020-11-23T06:35:54+05:30 IST

అస్థిఫలకాలతో చుట్టుకున్న పుఱ్ఱెపెట్టెలో మెదడు పెట్టేయబడింది...

చిక్కంతా దానితోనే

అస్థిఫలకాలతో

చుట్టుకున్న పుఱ్ఱెపెట్టెలో  

మెదడు పెట్టేయబడింది


గట్టెముకలతో

కుట్టుకున్న చుట్టుబుట్టలో

ఊపిరిగుత్తి కట్టేయబడింది


పొరలుపొరలుగావున్న

తోలుతో కుట్టేసినతిత్తిలో

పొట్ట చుట్టేయబడింది


ఎటొచ్చీ మనస్సే

అడ్డూ అదుపూలేకుండా వదిలేయబడింది


చిక్కంతా దానితోనే

గాదిరాజు మధుసూదన రాజు

97033 16760


Updated Date - 2020-11-23T06:35:54+05:30 IST