చిక్కుడుకాయ రసం

ABN , First Publish Date - 2022-01-01T19:24:56+05:30 IST

చలికాలంలో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఈ రసం ఎక్కువగా తీసుకుంటారు.

చిక్కుడుకాయ రసం

చలికాలంలో బెంగళూరుతో పాటు కర్ణాటకలోని కొన్ని ఇతర ప్రాంతాల్లో ఈ రసం ఎక్కువగా తీసుకుంటారు. ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా లభించే ఈ రసాన్ని ఇడ్లీ, రైస్‌, రోటీతో పాటు తింటారు. హల్వా, ఐస్‌క్రీమ్‌తోనూ తినడానికి ఇష్టపడతారు. 


కావలసినవి: ఉడికించిన చిక్కుడు విత్తనాలు - రెండు కప్పులు, చిక్కటి చింత పండురసం - మూడు టీస్పూన్లు, కరివేపాకు - రెండు రెమ్మలు, పసుపు - ఒక టీస్పూన్‌, నెయ్యి - ఒక టేబుల్‌స్పూన్‌, ఆవాలు - ఒక టీస్పూన్‌.


గ్రైండింగ్‌ కోసం : జీలకర్ర - రెండు టీస్పూన్లు, ధనియాలు - రెండు టీస్పూన్లు, పచ్చిమిర్చి - నాలుగు, ఇంగువ - అర టీస్పూన్‌, కొబ్బరి తురుము - పావు కప్పు, ఉడికించిన చిక్కుడు - రెండు మూడు టేబుల్‌స్పూన్లు. 


తయారీ విధానం: స్టవ్‌పై పాన్‌ పెట్టి జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఇంగువ వేసి వేయించాలి. నూనె వేయకుండా రోస్ట్‌ చేసుకోవాలి. తరువాత వీటిని మిక్సీలో వేసి, కొబ్బరి తురుము కలిపి, ఉడికించిన చిక్కుడు వేసి పేస్టులా చేసుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్లు కలుపుకోవచ్చు. స్టవ్‌పై మళ్లీ పాన్‌ పెట్టి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించిన చిక్కుడు గింజలు వేయాలి. కాసేపయ్యాక మిక్సీలో చేసిన పేస్టు వేయాలి. పసుపు వేసి మరిగించాలి. చింతపండు రసం కలుపుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. రసం మరుగుతున్నప్పుడే  కరివేపాకు వేయాలి. స్టవ్‌పై పాత్ర పెట్టి నెయ్యి వేసి వేడి అయ్యాక ఆవాలు వేసి వేయించాలి. ఈ పోపును రసంలో కలుపుకొని సర్వ్‌ చేయాలి. 

Updated Date - 2022-01-01T19:24:56+05:30 IST