కరోనా బాధిత పిల్లల కోసం బాలల సంరక్షణ కేంద్రాలు

ABN , First Publish Date - 2021-05-08T05:42:57+05:30 IST

తల్లిదండ్రులు కరోనా భారినపడిన సందర్భంలో పిల్లల యోగక్షేమాలు, వారి సంరక్షణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా బాలల సంరక్షణ పర్యవేక్షణ అధికారి వై.మోహనరావు, సంరక్షణ అధికారి బి.విజయకుమార్‌లు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.

కరోనా బాధిత పిల్లల కోసం బాలల సంరక్షణ కేంద్రాలు

గుంటూరు, మే 7: తల్లిదండ్రులు కరోనా భారినపడిన సందర్భంలో పిల్లల యోగక్షేమాలు, వారి సంరక్షణ నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యేకంగా బాలల సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా బాలల సంరక్షణ పర్యవేక్షణ అధికారి వై.మోహనరావు, సంరక్షణ అధికారి బి.విజయకుమార్‌లు శుక్రవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో జిల్లాలో బాలల సంరక్షణ కేంద్రాలు ప్రారంభించామన్నారు. తల్లిదండ్రులు కరోనా బారినపడి ఆస్పత్రులలో గానీ, హోం ఐసోలేషన్‌లో గానీ ఉంటే వారి పిల్లలను సంరక్షణ కేంద్రాల్లో చేర్పించవచ్చన్నారు. తల్లిదండ్రులు వైరస్‌ నుంచి కోలుకున్న తర్వాత వారి పిల్లలను అప్పగిస్తామన్నారు. బాధితుల్లో ఎవరైనా మరణిస్తే ఆయా పిల్లలను బాలల సంరక్షణ కేంద్రాలలోనే చూస్తామన్నారు. ఇందుకుగాను ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబరు 181, 1098లను అందుబాటులోకి తెచ్చిందన్నారు.   

Updated Date - 2021-05-08T05:42:57+05:30 IST