లక్కవరంలో నాలుగున్నర కేజీల శిశువు జననం

ABN , First Publish Date - 2021-09-19T05:08:35+05:30 IST

లక్కవరం ఆరోగ్యకేంద్రంలో ఓ తల్లి నాలుగున్నర కేజీల ఆడ శిశువుకు శనివా రం జన్మనిచ్చింది.

లక్కవరంలో నాలుగున్నర కేజీల శిశువు జననం
శిశువుతో ఆసుపత్రి సిబ్బంది

జంగారెడ్డిగూడెం టౌన్‌, సెప్టెంబరు 18 : లక్కవరం ఆరోగ్యకేంద్రంలో ఓ తల్లి నాలుగున్నర కేజీల ఆడ శిశువుకు శనివా రం జన్మనిచ్చింది. వైద్య ఆరోగ్య అధికారి ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ సాధారణం గా రెండు నుంచి మూడు కేజీల బరువు తో శిశువులు జన్మిస్తారని, లక్కవరానికి చెందిన వెలివెల కవితకు పుట్టిన బిడ్డ, ఆమె ఇద్దరూ ఆరోగ్యవంతంగా ఉన్నారన్నారు. కాన్పు చేసిన ఆసుపత్రి సిబ్బంది దిల్షద్‌బేగం సులోచన, సులక్షణ, ఏఎన్‌ఎం చంద్రావతిలను అభినందించారు.

Updated Date - 2021-09-19T05:08:35+05:30 IST