తల్లి నుంచే పిల్లలకు తెలివి

ABN , First Publish Date - 2020-02-14T08:26:15+05:30 IST

తల్లి జన్యువులే పిల్లల మేధా శక్తిని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. పిల్లల మేధస్సును నిర్ణయించడంలో తల్లి ఎక్స్‌ క్రోమోజోముల్లో ఉండే జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు చెప్పారు.

తల్లి నుంచే పిల్లలకు తెలివి

వాషింగ్టన్‌, ఫిబ్రవరి 13: తల్లి జన్యువులే పిల్లల మేధా శక్తిని నిర్ణయిస్తాయని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. పిల్లల మేధస్సును నిర్ణయించడంలో తల్లి ఎక్స్‌ క్రోమోజోముల్లో ఉండే జన్యువులు ప్రధాన పాత్ర పోషిస్తాయని వారు చెప్పారు. మహిళల్లో రెండు ఎక్స్‌ క్రోమోజోములు, పురుషుల్లో ఒక ఎక్స్‌ క్రోమోజోము ఉంటాయి. అయితే పిల్లల మేధస్సు నిర్ధారణలో మహిళల క్రోమోజోములే కీలకం. శాస్త్రవేత్తలు వారి పరిశోధనల్లో భాగంగా ఎలుకలకు తల్లి జన్యువులను అధిక మోతాదులో ప్రవేశపెట్టగా వాటి మెదడు, తల సాధారణం కంటే ఎక్కువగా పెరిగింది. తండ్రి జన్యువులను ప్రవేశపెడితే తల సాధారణంగా ఉండి శరీరం ఎక్కువగా పెరిగింది. తండ్రి జన్యువులు మెదడులో జ్ఞానానికి సంబంధించిన భాగాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అయితే మేధస్సులో ఈ జన్యువుల ప్రభావం 40-60 శాతం మాత్రమే ఉంటుందని, మిగతాది చుట్టూ ఉన్న పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

Updated Date - 2020-02-14T08:26:15+05:30 IST