బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం

ABN , First Publish Date - 2022-01-25T05:07:01+05:30 IST

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని రైల్వేకోడూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజని ప్రియదర్శిని పేర్కొన్నారు.

బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
బహుమతులు ప్రదానం చేస్తున్న జడ్జి అంజని ప్రియదర్శిని

రైల్వేకోడూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజని ప్రియదర్శిని


రైల్వేకోడూరు రూరల్‌, జనవరి 24: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని రైల్వేకోడూరు జూనియర్‌ సివిల్‌ జడ్జి అంజని ప్రియదర్శిని పేర్కొన్నారు. సోమవారం జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మండలంలోని లక్ష్మీగారిపల్లి జిల్లా పరిషత్‌ హైస్కూల్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ బాలికలు బాగా చదివి ఉన్నత స్థాయిలో రాణించాలని కోరారు. అనంతరం పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన పోటీలలో గెలుపొందిన బాలికలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో అడ్వకేట్‌ ఎం.సురేష్‌ రెడ్డి, పాఠశాల ప్రఽధానోపాధ్యాయురాలు డి.విమల తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-25T05:07:01+05:30 IST