ఆడుకుంటూ బాలుడి అదృశ్యం

ABN , First Publish Date - 2021-10-22T04:48:35+05:30 IST

సంగం నిమ్మతోపు గంగమ్మ ఆలయం సమీపంలో నివాసముంటున్న శివగణేష్‌ అనే మూడేళ్ల బాలుడు గురువారం రాత్రి అదృశ్య మయ్యాడు.

ఆడుకుంటూ బాలుడి అదృశ్యం

సంగం, అక్టోబరు 21: సంగం నిమ్మతోపు గంగమ్మ ఆలయం సమీపంలో నివాసముంటున్న శివగణేష్‌ అనే మూడేళ్ల బాలుడు గురువారం రాత్రి అదృశ్య మయ్యాడు. గ్రామానికి చెందిన శ్రీహరి, రవళి దంపతులకు ఇద్దరు పిల్లలు. దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తున్నారు. ఇటీవల నెలన్నర కిందట రవళి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో శ్రీహరి ఇద్దరి పిల్లలను అమ్మమ్మ వద్ద వదిలి తిరుపతికి కూలి పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో రాత్రి 7 గంటల సమయంలో గంగమ్మ గుడి వద్ద వీధి లైట్ల వెలుతురులో పిల్లలతో కలిసి శ్రీహరి కుమారుడు శివగణేష్‌(3) ఆడుకుంటూ పక్కనే ఉన్న దువ్వూరు కాలువ వైపు వెళ్లబో యాడు. అక్కడే ఉన్న 13 ఏళ్ల బాలుడు గుర్తించి పక్కకు తీసుకువచ్చి వదిలి వెళ్లాడు. ఆ తరువాత కొంతసేపటికి శివగణేష్‌ తాత వెతుక్కుంటూ గంగమ్మ గుడి వద్దకు వచ్చాడు. బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందిం చారు. బుచ్చి సీఐ కోటేశ్వరరావు, ఎస్‌ఐ నాగార్జునరెడ్డి ఘటనా స్థలిని పరిశీలించి విచారించారు. బాలుడు పక్కనే ఉన్న కాలువ నీటిలో ప్రమాదవశాత్తు పడి గల్లం తై ఉంటాడని  అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు చేపట్టలేదు. శుక్రవారం గాలించనున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-10-22T04:48:35+05:30 IST