చిన్నారికి పునర్జన్మ

ABN , First Publish Date - 2021-03-06T05:58:45+05:30 IST

తక్కువ బరువు, అవయవాల ఎదుగుదల లేక శ్వాస తీసుకోవడంలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏడు నెలల చిన్నారికి కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాక తల్లి, చిన్నారిని ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్చి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు.

చిన్నారికి పునర్జన్మ
చంటిబిడ్డను తల్లికి అప్పగిస్తున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహాలక్ష్మి

 జీజీహెచ్‌ (కాకినాడ), మార్చి 5: తక్కువ బరువు, అవయవాల ఎదుగుదల లేక శ్వాస తీసుకోవడంలో ఉండి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఏడు నెలల చిన్నారికి కాకినాడ జీజీహెచ్‌ వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. బిడ్డ పూర్తి ఆరోగ్యంతో కోలుకున్నాక తల్లి, చిన్నారిని ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్చి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రావుల మహాలక్ష్మి తెలిపారు. ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామానికి చెందిన అత్తిలి గంగాభవాని రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో ప్రసవించింది. అయితే వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బిడ్డ ఎదుగుదలలో లోపాలను గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం సుమారు రూ. 20 లక్షలు అవుతుందని, అయినా బిడ్డ బతకడంపై గ్యారంటీ ఇవ్వలేమని చెప్పారు. దీంతో వారు జనవరి 13న కాకినాడ జీజీహెచ్‌లో పీడియాట్రిక్స్‌ విభాగంలో  బిడ్డను చేర్పించారు.  విభాగాధిపతి డాక్టర్‌ ఎంఎస్‌ రాజు, ప్రొఫెసర్లు డాక్టర్‌ మాణిక్యాంబ, డాక్టర్‌ కృష్ణప్రసాద్‌ 43 రోజుల పాటు ప్రత్యేక చికిత్స అందించారు. చిన్నారిని ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడారు. నియోనటాలజి్‌స్ట్‌లు డాక్టర్‌ ఎం.వెంకటేశ్వర్లు, డాక్టర్‌ ఏ.సత్యవాణి, డాక్టర్‌ ఝాన్సీ, డాక్టర్‌ సంబంధం, డాక్టర్‌ గణపతి సూర్యనారాయణ, డాక్టర్‌ నరసింహారెడ్డిను వైద్యాధికారులు అభినందించారు. గంగాభవాని, మణికంఠ దంపతులు వైద్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు.  


Updated Date - 2021-03-06T05:58:45+05:30 IST