Abn logo
Sep 26 2021 @ 00:45AM

ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవం

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లీబిడ్డలు

 ఇలాగేనా.. మాతాశిశు సంరక్షణ?

ఆస్పత్రి బాత్రూమ్‌లో ప్రసవం

పురిటి నొప్పులతో వచ్చిన గర్భిణికి సిబ్బంది చుక్కలు

వేరే ఆస్పత్రికి వెళ్లాలంటూ తప్పించుకునే ప్రయత్నం

ఇంతలోనే కాలకృత్యాలకు వెళ్లి.. ప్రసవం..


మాతాశిశు మరణాలకు ఆస్కారమే ఇవ్వొద్దు..

మొదటి నెల నుంచే గర్భిణులను జాగ్రత్తగా చూసుకోవాలి..

పౌష్టికాహారం అందించాలి.. ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలి..

ప్రతి ప్రసవం ఆస్పత్రిలోనే జరగాలి..

ఇవీ.. ప్రజాప్రతినిధులు, వైద్యాధికారులు నిత్యం పలికే పలుకులు..

క్షేత్రస్థాయిలో జరుగుతున్నదేంటి?

ప్రసవ వేదనతో ఆస్పత్రికి వస్తే..

సిబ్బంది చుక్కలు చూపించారు..

బిడ్డ బరువు తక్కువగా ఉందనీ, కష్టమని అబద్ధాలు చెప్పారు..

వేరే ఆస్పత్రికి వెళ్లాలంటూ తప్పించుకునే ప్రయత్నం చేశారు..

ఇంతలోనే కాలకృత్యాలకు వెళ్లిన గర్భిణి..

బాత్రూమ్‌లోనే ప్రసవించింది..

3 కిలోల ఆరోగ్యవంతమైన మగ శిశువుకు జన్మనిచ్చింది..

ప్రభుత్వాస్పత్రుల్లో అందుతున్న వైద్యానికి ఇదో నిదర్శనం..

ఆ సమయంలో తల్లీబిడ్డకు ఏమైనా అయ్యుంటే ఎవరిది బాధ్యత?

మాతాశిశు సంరక్షణ అంటే ఇదేనా..? ఇలాగేనా..?


రాయదుర్గం, సెప్టెంబరు 25: కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్రూమ్‌కు వెళ్లిన గర్భి ణి అక్కడే ప్రసవించింది. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో శనివారం ఉదయం ఈ ఘట న చోటుచేసుకుంది. పట్టణంలోని చంద్రబాబునాయుడు కాలనీలో నివాసముండే లక్ష్మి ప్ర సవం కోసం శనివారం తెల్లవారుజామునే ప్రభుత్వ వైద్యశాలకు బంధువులతో కలసి వచ్చిం ది. విధుల్లో ఉన్న డాక్టర్‌ కంటే ముందు నర్సులు చూసి, ఆమెకు కాన్పు చేయలేమనీ, బిడ్డ తక్కువ బరువు ఉందని చెప్పుకొచ్చారు. దీంతో వెంటనే కళ్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి వెళ్లి కాన్పు చేసుకోవాలని వారికి తేల్చిచెప్పారు. ఎలాగైనా కాన్పు ఇక్కడే చేయాలని వారు నర్సులకు మొర పెట్టుకున్నారు. 5వ కాన్పు కావడంతో తాము అంతటి సాహసం చేయలేమనీ, వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో నర్సులతో వాగ్వాదం చేస్తుండగానే.. కాలకృత్యాల కోసం గర్భిణి లక్ష్మి బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఒక్కసారిగా కేకపెట్టి పండంటి మగ శిశువుకు అక్కడే జన్మనిచ్చింది. శిశువు మూడు కిలోల బరువు ఉండటమే కాకుండా ఆరోగ్యంగా ఉన్నట్లు తేల్చారు. దీంతో బంధువులు.. ఆస్పత్రి సిబ్బందిపై తీవ్ర ఆ గ్రహం వ్యక్తం చేశారు. చికిత్స చేయకుండానే తమను రెఫర్‌ చేయడంపై మండిపడ్డారు. సి బ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనిపై వైద్యాధికారి మంజువాణిని వివరణ కోరగా, ఈ వ్యవహారంలో సిబ్బంది తప్పిదం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు.


జిల్లా వైద్యాధికారి విచారణ

బాత్రూమ్‌లో ప్రసవంపై జిల్లా వైద్యాధికారి కామేశ్వరరావు నేతృత్వంలో విచారణ చేపట్టారు. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులతో ఆయన వివర ణ తీసుకున్నారు. కారకులపై చర్యలు తీసుకునే విషయానికి సంబంధించి స్పష్టత ఇవ్వలేదు. విచారణ నివేదికను కమిషనర్‌కు సమర్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విధుల్లో ఉన్న వై ద్యురాలితోపాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన నర్సులు, ఇతర సిబ్బంది, బాధితుల నుంచి రాతపూర్వక వివరణ  తీసుకున్నట్లు తెలిపారు. ఆయన వెంట జిల్లా కోఆర్డినేటర్‌ నాగశివశయనారెడ్డి, నాగశేషు పాల్గొన్నారు.