Abn logo
Oct 14 2021 @ 23:53PM

అంబులెన్స్‌లో మహిళ ప్రసవం

కులకచర్ల: 108 అంబులెన్స్‌లో మహిళ ప్రసవించింది. చౌడాపూర్‌నకు చెందిన శిరీషకు గురువారం పురిటినొప్పు లు రావడంతో 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో మహబూబ్‌నగర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని, వారిని ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించినట్లు ఈఎన్‌టీ ప్రవీన్‌, పైలెట్‌ నర్సింహులు తెలిపారు.