Advertisement
Advertisement
Abn logo
Advertisement

గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో బాలల దినోత్సవం

ఎన్నారై డెస్క్: గల్ఫ్ తెలుగు సంఘాల ఆధ్వర్యంలో ‘బాలలచేత-బాలలకోసం’ పేరుతో బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 65పైగా తెలుగు సంఘాలు భాగస్వామ్యం అయ్యాయి. 12 గంటలపాటు పూర్తిగా వర్చువల్ పద్ధతిలోనే జరిగిన ఈ కార్యక్రమంలో 25 దేశాలలోని తెలుగు పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు తన సందేశాన్ని పంపించారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను ముందు తరాలకు అందజేసే కార్యక్రమంలో ముందుగా మనకట్టు, బొట్టు, ఆట, పాట, పండుగలు, పబ్బాలను పిల్లలకు పరిచయం చేయాలని.. దానికి బాలల దినోత్సవం వంటి సందర్భాన్ని వినియోగించుకోవడం సంతోషకరమైన విషయం అన్నారు. ముఖ్యంగా మన సంస్కృతికి మూలమైన మాతృభాషను పిల్లలకు నేర్పించాలని.. శతక పద్యాలు, కథలు వారికి తెలియజేయాలని అన్నారు. ఈ కార్యక్రమ స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని సంస్థలు విద్యార్థులను మనవైన విలువలతో తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగాలని కోరుతూ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. 


అంతేకాకుండా పిల్లలకు తన ఆశీస్సులను అందించారు. ప్రత్యేక అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ ప్రసంగించారు. ఇలాంటి పిల్లల పండుగను నిర్వహించిన నిర్వాహకులకు అభినందనలు తెలియచేశారు. మరొక గౌరవ అతిథిగా పాల్గొన్న గుమ్మడి గోపాలకృష్ణ  మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నాకాని మన సంస్కృతి సంప్రదాయాలు, భాషను మర్చిపోకుండా పూర్తిగా పిల్లలతో ఈ కార్యక్రమం నిర్వహించటం సంతోషమన్నారు. వారి ప్రదర్శనలను తిలకించి మైమరచిపోయానన్నారు. వంశీ ఇంటర్నేషనల్ అధినేత రామరాజు మాట్లాడుతూ.. నేటి బాలలే రేపటి పౌరులని, పిల్లలతో ఇలాంటికార్యక్రమాలు నిర్వహించటం అందునా అన్నిరకాల ప్రదర్శనలు చేయటం చాలా సంతోషమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు కుదరవల్లి సుధాకరరావు మాట్లాడుతూ..ఈ కార్యక్రమంలో భాగస్వాములైన 65 తెలుగు సంఘాల అధ్యక్షులకు, ఎంతో ఉత్సాహంతో పాల్గొన్న పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియచేశారు. ఈ బాలలదినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్విజ్ పోటీల విజేతలను ప్రకటించారు.


 కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన విక్రం, వెంకప్ప భాగవతుల, ప్రదీప్ కుమార్, ఎం.బి. రెడ్డి మరియు గల్ఫ్ తెలుగు సంఘాల సమాఖ్యలోని భాగస్వామి సంఘాల అధ్యక్షులకు వారి కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు సంఘాల ఐఖ్య వేదిక కువైత్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు, సౌది తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు దీపిక రావి, తెలుగు కళా సమితి ఒమన్ అధ్యక్షులు అనిల్ కుమార్, ఆంధ్రకళా వేదిక ఖతర్ అధ్యక్షులు సత్యనారణ మలిరెడ్డి, ఫుజైరా తెలుగు కుటుంబాలు అధ్యక్షులు వేదమూర్తి, తెలుగు తరంగిని రాస్‌ అల్ ఖైమా అధ్యక్షులు వెంకట సురేష్.. తదితరులు పిల్లలు జీవితంలో అలవర్చు కోవాల్సిన క్రమశిక్షణ, నిజాయితీ, నిజం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథం, సహాయ చేయడం, జ్ఞానము, ఏకాగ్రత వంటి పిల్లలుక ప్రేరణ కలిగించే అంశాలపై ప్రసంగించి వారిని ఉత్తేజ పరిచారు. ఇదిలా ఉంటే.. ఈ కార్యక్రమంలో అతిథులుగా మారిషస్ నుంచి సంజీవ నరసిహం, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షులు డాక్టర్ ప్రతాప్, సింగపూర్ శ్రీ సాంస్కృతిక కళా సారథి అధ్యక్షులు రత్న కుమార్, శుబోదయం ఇంఫ్రా ఛైర్మన్ లక్ష్మి ప్రసాద్, తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు. Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement