Advertisement
Advertisement
Abn logo
Advertisement

పండుమిర్చి కారం

కారంగా... కమ్మగా

పండుమిర్చి అంటే పచ్చడి ఒక్కటే కాదు నోరూరించే రుచులు చాలానే ఉన్నాయి. పండుమిర్చితోచికెన్‌ఫ్రై,  ఫ్రైడ్‌ రైస్‌ లొట్టలేయిస్తాయి. అలాగే పండుమిర్చి అల్లం  పచ్చడి, దోశ మళ్లీ మళ్లీ తినాలనిపించేవే.  ఈవారం పండుమిర్చితో  ఈ సరికొత్త రుచులను ఇంటిల్లిపాదితో ఆస్వాదించండి మరి...


కావలసినవి: పండు మిరపకాయలు- ఇరవై, జీలకర్ర- రెండు టీస్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- నాలుగు, ఉల్లిపాయ- ఒకటి, చింతపండు- కొద్దిగా, ఉప్పు- తగినంత, నూనె- సరిపడా, కరివేపాకు- రెండు రెమ్మలు.


తయారీ విధానం: ఒక టీస్పూన్‌ జీలకర్రను వేగించి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరగాలి. వెల్లుల్లి రెబ్బలను కట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు వేసి వేగించాలి. మిరపకాయలు వేగిన తరువాత స్టవ్‌పై నుంచి దింపి చల్లారనివ్వాలి. తరువాత చింతపండు జోడించి మిక్సీలో వేసి మెత్తని పేస్టులా గ్రైండ్‌ చేసుకోవాలి. స్టవ్‌పై మరో పాన్‌ పెట్టి కొద్దిగా నూనె వేసి జీలకర్ర వేయాలి. కరివేపాకు వేయాలి. అవి వేగిన తరువాత సిద్ధంగా ఉన్న ఎండు మిరప పేస్ట్‌ వేసి కాసేపు ఉడికించాలి. ఈ కారంను దోశపై రాస్తే రుచిగా ఉంటుంది. ఫ్రిజ్‌లో పెట్టుకుంటే ఈ కారం వారం రోజులు నిల్వ ఉంటుంది.


పటిశప్త ఉందియువెజ్‌ లాలీపాప్‌చైనీస్‌ ఫైవ్‌ స్పైస్‌ రైస్‌పెరుగు శాండ్‌విచ్‌కశ్మీరీ కహ్వా టీపనీర్‌ వెర్మిసెల్లీ బాల్స్‌చిల్లీ-ఆనియన్‌ క్రాకర్స్‌పత్తర్‌ కా ఘోష్‌లేడీ ఫింగర్‌ (బిస్కెట్‌)
Advertisement

నవ్య మరిన్ని