చైనాలో మళ్లీ అలజడి

ABN , First Publish Date - 2020-08-01T08:49:24+05:30 IST

కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది.

చైనాలో మళ్లీ అలజడి

మూడో రోజూ 100కి పైగా కేసులు.. అమెరికాలో 68 వేలు


బీజింగ్‌, జూలై 31: కరోనా పుట్టినిల్లు చైనాలో వైరస్‌ మళ్లీ విజృంభిస్తోంది. ఇక్కడ వైరస్‌ పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చిందని భావిస్తున్న సమయంలో వరుసగా మూడో రోజు కూడా వందకిపైనే కేసులు నమోదయ్యాయి. శుక్రవారం దేశవ్యాప్తంగా 127 కరోనా కేసులు బయటపడినట్టు అధికారులు ప్రకటించారు. మార్చి 5 తర్వాత చైనాలో ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదవడం ఇదే తొలిసారి. చైనాలో ఇప్పటివరకు 84,292 మందికి వైరస్‌ సోకగా.. 4,634 మంది చనిపోయారు. ఇక అమెరికాలో కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి.


గత 24 గంటల్లో ఇక్కడ 68వేల కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య కూడా 46 లక్షలు దాటింది. వైరస్‌ వల్ల మరో 1,465 మంది మృత్యువాతపడ్డారు. బ్రెజిల్‌లో కరోనా కేసులు మరోసారి 50 వేల మార్కుని దాటేశాయి. దక్షిణాఫ్రికాలో తాజాగా 11,046 కేసులు నమోదవడంతో మొత్తం బాధితుల సంఖ్య 5 లక్షలకు చేరువైంది. ఇక వైరస్‌ను చక్కగా కట్టడి చేసిన వియత్నాంలో 99 రోజుల తర్వాత తొలి కరోనా మరణం నమోదైంది. పాకిస్థాన్‌లో కొత్తగా 903 మందికి వైరస్‌ సోకగా.. మొత్తం కేసుల సంఖ్య 2,78,305కి పెరిగింది.

Updated Date - 2020-08-01T08:49:24+05:30 IST