కరోనా ముగుసులో సరిహద్దులను ఆక్రమిస్తున్న చైనా: అమెరికా

ABN , First Publish Date - 2020-06-06T23:04:19+05:30 IST

సరిహద్దు దేశాల్లోని ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా ...

కరోనా ముగుసులో సరిహద్దులను ఆక్రమిస్తున్న చైనా: అమెరికా

వాషింగ్టన్: సరిహద్దు దేశాల్లోని ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా ప్రయత్నిస్తోందని అమెరికా  మండిపడింది. కరోనాను అడ్డుపెట్టుకుని చైనా ఈ దురాక్రమణకు పూనుకుంటోందని జపాన్‌లోని అమెరికా సైనిక దళాల కమాండర్ ల్యూటనెంట్ జనరల్ కెవిన్ స్చ్‌నెయిడర్ పేర్కొన్నారు. ముఖ్యంగా దక్షిణ చైనా సముద్రంలో ఓడలను తిప్పుతూ పక్క దేశాల జలాలను కూడా ఆక్రమిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు చైనా సముద్రంలో కూడా ఆ దేశం దురాక్రమణలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో జపాన్‌తో చైనాకు ఎప్పటినుంచో సరిహద్దు వివాదం కొనసాగుతోందని, ఇప్పుడు ఆ ప్రాంతాలను ఎలాగైనా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.


ఇదిలా ఉంటే చైనాకు సరిహద్దు వివాదాలు కొత్తేం కాదు. తన చుట్టుపక్కల ఉన్న ప్రతి దేశంతోనూ చైనాకు సరిమద్దు వివాదాలు ఉన్నాయి. భారత్‌తో కూడా లడాఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం వంటి ప్రాంతాల్లో చైనాకు సరిహద్దు వివాదాలున్నాయి. ప్రస్తుతం ఈ విషయంలోనే సరిహద్దుల వద్ద ఇరు దేశాల మధ్య సైనిక ప్రతిష్ఠంభన కూడా కొనసాగుతోంది.

Updated Date - 2020-06-06T23:04:19+05:30 IST