వూహాన్‌లో 76 రోజుల కరోనా లాక్‌డౌన్ ఎత్తివేత

ABN , First Publish Date - 2020-04-08T10:45:19+05:30 IST

కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రమైన చైనా దేశంలోని వూహాన్ నగరంలో బుధవారం 76రోజుల లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు....

వూహాన్‌లో 76 రోజుల కరోనా లాక్‌డౌన్ ఎత్తివేత

వూహాన్ (చైనా): కరోనా వైరస్ వ్యాప్తి కేంద్రమైన చైనా దేశంలోని వూహాన్ నగరంలో బుధవారం 76రోజుల లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. గత ఏడాది డిసెంబరులో మొట్టమొదటిసారి వూహాన్ నగరంలో కరోనా వైరస్ ఉద్భవించడంతో అధికారులు ఆంక్షలు విధించారు. ఈ వైరస్ వచ్చినప్పటి నుంచి 76 రోజుల పాటు పూర్తిగా వూహాన్ నగరాన్ని లాక్‌డౌన్ చేశారు. కరోనా వైరస్ బారినుంచి నగరంలోని రోగులు కోలుకోవడంతో లాక్‌డౌన్ ఎత్తివేయడంతో వూహాన్ నగరంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వూహాన్ నగరం నుంచి మొదటి రైలు దక్షిణ చైనాలోని గ్వాంగ్జీ జువాంగ్ అటానమస్ రీజియన్‌లోని నానింగ్‌కు వెళుతుందని వూహాన్ రైల్వే అథారిటీ వెల్లడించింది.


బుధవారం ఉదయం ఈ మొట్టమొదటి రైలులో 55వేల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. రవాణాపై విధించిన ఆంక్షలు ఎత్తివేయడంతో బుధవారం ఉదయం నుంచే రోడ్లపై వాహనాల సందడి కనిపించింది. హుబే ప్రావిన్సులో వూహాన్ నగరం మినహా మిగతా ప్రాంతాల్లో మార్చి 25వతేదీనే లాక్‌డౌన్ ను ఎత్తివేశారు. కరోనా బారినుంచి కోలుకొని ఆరోగ్యంగా ఉన్న వారికి ఆకుపచ్చ క్యూఆర్ కోడ్ ఇచ్చి వారు బయట తిరిగేందుకు అనుమతిస్తున్నారు. 

Updated Date - 2020-04-08T10:45:19+05:30 IST