చైనా మాస్క్‌లు సురక్షితం కాదు: ఫిన్లాండ్‌

ABN , First Publish Date - 2020-04-10T08:44:39+05:30 IST

కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుంచి తెప్పించుకున్న మాస్క్‌లు సురక్షితంగా...

చైనా మాస్క్‌లు సురక్షితం కాదు: ఫిన్లాండ్‌

హెల్సింకి, ఏప్రిల్‌ 9: కరోనా వైరస్‌ బాధితులకు చికిత్స అందించే వైద్య సిబ్బందికి ఇచ్చేందుకు చైనా నుంచి తెప్పించుకున్న మాస్క్‌లు సురక్షితంగా లేవని ఫిన్లాండ్‌ తెలిపింది. ఆ మాస్కులు నిర్ణీత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేవని పేర్కొంది. చైనాలోని గ్వాంగ్‌జౌ నుంచి వచ్చిన 2 లక్షల సర్జికల్‌ మాస్కులు, 2.3 లక్షల రెస్పిరేటర్‌ మాస్కులను వాడే ముందు ఒకసారి పరీక్షించాలని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఐనో కైసా పెకోనెన్‌ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఆ మరుసటి రోజే ఫిన్లాండ్‌ అధికారులు ఈ మాస్కులు రక్షణ ప్రమాణాలను అందుకోలేదని ప్రకటించారు. ఇది తమను నిరుత్సాహానికి గురిచేసిందని చెప్పారు.

Updated Date - 2020-04-10T08:44:39+05:30 IST