ఆఫ్రికాకు వంద కోట్ల టీకాలు : జిన్‌పింగ్‌

ABN , First Publish Date - 2021-11-30T12:46:22+05:30 IST

ఆఫ్రికాకు 100 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు, 8 లక్షల ఉద్యోగాల కల్పన, రుణాలు మాఫీ చేస్తామని చైనా హామీ ఇచ్చింది

ఆఫ్రికాకు వంద కోట్ల టీకాలు : జిన్‌పింగ్‌

బీజింగ్‌, నవంబరు 29 : అగ్రరాజ్యం అమెరికాకు సవాల్‌ విసిరేలా చైనా మరో అడుగు వేసింది. పేద దేశం ఆఫ్రికాకు వివిధ ప్రోత్సాహకాలను ప్రకటించడం ద్వారా చైనా తన ప్రాబల్యాన్ని చాటుకునే ప్రయత్నం చేసింది. ఆఫ్రికాకు 100 కోట్ల కొవిడ్‌ టీకా డోసులు, 8 లక్షల ఉద్యోగాల కల్పన, రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చింది. 

ఆఫ్రికన్‌ నేతలతో సోమవారం జరిగిన సమావేశంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ పాల్గొన్నారు. ఆఫ్రికాలో జాత్సంహంకారం, స్థానిక వ్యవహారాల్లో విదేశీ జోక్యానికి వ్యతిరేకంగా పోరాడతామని భరోసా ఇచ్చారు. చైనా-ఆఫ్రికా సహకార ఫోరం 8వ మినిస్టీరియల్‌ సమావేశంలో ఆయన ఆన్‌లైన్‌లో పాల్గొని ప్రసంగించారు.  

Updated Date - 2021-11-30T12:46:22+05:30 IST