టోక్యో ఒలింపిక్స్ లో మూడో స్థానానికి పడిపోయిన చైనా..!

ABN , First Publish Date - 2021-07-27T14:13:58+05:30 IST

ఒలింపిక్స్-2021లో చైనా మూడో స్థానానికి పడిపోయింది. 7 గోల్డ్, 5 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. 8 పసిడి, 3 రజతం, 8 కాంస్య పతకాలతో..

టోక్యో ఒలింపిక్స్ లో మూడో స్థానానికి పడిపోయిన చైనా..!

టోక్యో: ఒలింపిక్స్-2021లో చైనా మూడో స్థానానికి పడిపోయింది. 7 గోల్డ్, 5 సిల్వర్, 7 బ్రాంజ్ మెడల్స్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. 8 పసిడి, 3 రజతం, 8 కాంస్య పతకాలతో మొత్తం 19 పతకాలు నెగ్గి అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. రెండో స్థానంలో 8 బంగారు, 2 రజత, 3 కాంస్య పతకాలతో జపాన్ ఉంది.  ఇక భారత్ మీరాబాయి చాను గెలిచిన ఒకే ఒక్క రజత పతకంతో 34వ స్థానంలో ఉంది. బల్గేరియా, బెల్జియం, కొలంబియా, డెన్మార్క్, జోర్డాన్, రొమేనియా, దక్షిణాఫ్రికాలు కూడా ఒక్కో రజత పతకం గెలిచి భారత్‌తో కలిసి 34వ స్థానాన్ని పంచుకుంటున్నాయి. ఇక ఇప్పటి వరకు దాదాపు 51 జట్లు(వివిధ దేశాలకు చెందిన నేషనల్ ఒలింపిక్ కమిటీలు) టోక్యో ఒలింపిక్స్ పతకాల వేటలో బోణీ కొట్టాయి.



Updated Date - 2021-07-27T14:13:58+05:30 IST