భారత్‌లోని తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

ABN , First Publish Date - 2020-05-26T02:29:12+05:30 IST

కరోనా వైరస్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తరలించనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ

భారత్‌లోని తమ దేశీయులను తరలించేందుకు సిద్ధమైన చైనా

న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ పౌరులను తరలించనున్నట్టు చైనా ప్రకటించింది. ఈ మేరకు చైనా ఎంబసీ వెబ్‌సైట్‌ పేర్కొంది. లాక్‌డౌన్ కారణంగా భారత్‌లో చిక్కుకుపోయిన తమ దేశ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలను తరలించనున్నట్టు తెలిపింది. స్వదేశానికి రావాలనుకున్న వారు ప్రత్యేక విమానాల్లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరింది. భారత్‌లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరిగి టాప్-10 దేశాల్లో చేరడంతో చైనా ఈ నిర్ణయం తీసుకుంది. 


భారత్‌లో కరోనా వైరస్ కేసులు 1.50 లక్షలకు చేరువయ్యాయి. మరణాలు 4 వేలు దాటేశాయి. కాగా, చైనాలో వైరస్ వెలుగు చూసిన వెంటనే వుహాన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను జనవరి-ఫిబ్రవరిలో కేంద్రం స్వదేశానికి తీసుకొచ్చింది. కాగా, గత వారం భారత ప్రభుత్వం దేశంలో చిక్కుకుపోయిన వివిధ దేశాలకు చెందిన 60 వేల మంది ప్రత్యేక విమానాల ద్వారా వారి సొంత దేశాలకు చేర్చింది.

Updated Date - 2020-05-26T02:29:12+05:30 IST