మళ్లీ తోకజాడిస్తోన్న China... అలర్ట్ అయిన సైన్యం

ABN , First Publish Date - 2021-07-22T02:31:45+05:30 IST

ఇన్ని రోజుల పాటు కాస్త సైలెంట్‌గా ఉన్న చైనా మళ్లీ తోకజాడిస్తోంది. ఇన్ని రోజుల పాటు గాల్వాన్ వద్ద

మళ్లీ తోకజాడిస్తోన్న China... అలర్ట్ అయిన సైన్యం

న్యూఢిల్లీ : ఇన్ని రోజుల పాటు కాస్త సైలెంట్‌గా ఉన్న చైనా మళ్లీ తోకజాడిస్తోంది. ఇన్ని రోజుల పాటు గాల్వాన్ వద్ద ఉద్రిక్తతలకు తావిచ్చిన చైనా... తాజాగా ఉత్తరాఖండ్‌ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంబడి తన సైనిక కార్యకలాపాలను పెంచింది. ఉత్తరాఖండ్‌లోని బారాహాటి ప్రాంతం వద్ద తన చైనా సైనిక కదలికలు కనిపించాయి. ఈ కదలికల నేపథ్యంలో భారత సైన్యం అలర్ట్ అయ్యింది. దాదాపు 35 చైనా బలగాలు ఈ ప్రాంతం వద్ద గస్తీ నిర్వహించినట్లు ఆర్మీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే చైనా దళాల కార్యకలాపాలను తాము ఓ కంట కనిపెడుతూనే ఉన్నామని ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు. అయితే చైనా ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలకు తావిచ్చే కవ్వింపు చర్యలకు దిగే ఛాన్స్ ఉందేమోనని ప్రభుత్వ వర్గాలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. భారత త్రిదళాధిపతి బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ నరవాణే ఇద్దరూ చైనా వ్యవహారాలపై నిరంతరం సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారని తెలుస్తోంది. 

Updated Date - 2021-07-22T02:31:45+05:30 IST