చైనా ప్రపంచ రికార్డు

ABN , First Publish Date - 2021-07-30T09:18:55+05:30 IST

సంచలన తారలు కేటి లెడెకి, అరియార్నె టిట్మ్‌సతో కూడిన అమెరికా, ఆస్ట్రేలియా జట్లకు చైనా షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల 4గీ200 మీ. ఫ్రీస్టయిల్‌ రిలే స్విమ్మింగ్‌ లో చైనా ప్రపంచ రికార్డు...

చైనా ప్రపంచ రికార్డు

  • మహిళల ఫ్రీస్టయిల్‌ స్విమ్మింగ్‌
  • అమెరికా, ఆస్ట్రేలియాకు షాక్‌

సంచలన తారలు కేటి లెడెకి, అరియార్నె టిట్మ్‌సతో కూడిన అమెరికా, ఆస్ట్రేలియా జట్లకు చైనా షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల 4x200 మీ. ఫ్రీస్టయిల్‌ రిలే స్విమ్మింగ్‌ లో చైనా ప్రపంచ రికార్డు టైమింగ్‌తో స్వర్ణాన్ని ఎగరేసుకుపోయింది. యాంగ్‌, తాంగ్‌, లీ, జాంగ్‌తో కూడి చైనా జట్టు 7ని.40.33 సె. సమయంతో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికా (7ని.40.73సె.) రజతం, ఆస్ట్రేలియా (7ని41.29సె) కాంస్య పతకం నెగ్గాయి. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో 4x200 మీ. రిలే ఈవెంట్‌ను ప్రవేశపెట్టాక ఆస్ట్రేలియా, అమెరికాగాక మరో జట్టు పసిడి పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి. 


Updated Date - 2021-07-30T09:18:55+05:30 IST