ప్రజారోగ్యం పట్టని పాలకులు

ABN , First Publish Date - 2021-04-11T06:56:53+05:30 IST

ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని వైసీపీ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై వేసవి. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెల్లో ప్రజారోగ్యంపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మండలంలోని చిన పాడ్రాకలో పీహెచ్‌సీకి అనుసంధానంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రి.

ప్రజారోగ్యం పట్టని పాలకులు
30 పడకల ఆసుపత్రి భవనాన్ని, పరిసరాలను పరిశీలిస్తున్న ప్రజాసంఘాల నాయకులు

 టీడీపీ హయాంలో చిన పాడ్రాకలో 30 పడకల ఆసుపత్రి 

రెండేళ్లయినా సౌకర్యాలు కల్పించని వైసీపీ ప్రభుత్వం

 బంటుమిల్లి : ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తున్నామని వైసీపీ పాలకులు ప్రగల్భాలు పలుకుతున్నారు. అసలే కరోనా కాలం.. ఆపై వేసవి. ఇలాంటి పరిస్థితుల్లో పల్లెల్లో ప్రజారోగ్యంపై ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మండలంలోని చిన పాడ్రాకలో పీహెచ్‌సీకి అనుసంధానంగా నిర్మించిన 30 పడకల ఆసుపత్రి. చిన పాండ్రాక వైద్య విజ్ఞాన పరిషత్‌ ఆసుపత్రిని 30 పడకలతో  గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు 24 గంటలు సేవలు అందించే విధంగా 4 కోట్ల రూపాయలతో నిర్మించారు.  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా  30 పడకల ఆసుపత్రిలో సౌకర్యాలు కల్పించాలేదు. డాక్టర్‌నూ నియమిం చలేదు. దానిని నిరుపయోగంగా వదిలేశారు. కరోనా కాలంలో విస్తృత వైద్య సేవలందించాల్సిన 30 పడకల ఆసుపత్రిని నిర్లక్ష్యంగా వదిలేయడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  ఈ 30 పడకల ఆసుపత్రి అందుబాటులోకి రాకపోవడం వల్ల  బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల పరిధిలోని పలు గ్రామాల రోగులు భీమవరం, మచిలీపట్నం, గుడివాడ వెళ్లాల్సి వస్తోంది. దీనివల్ల  దూరాభారం పెరిగి సకాలంలో వైద్యం అందకపోవడమే కాక, ఆర్థికంగానూ నష్టపోతున్నారు.  ప్రజాప్రతినిఽధులు, అధికారులు స్పందించి 30 పడకల ఆసుపత్రిలో వైద్య సిబ్బందిని నియమించి, వైద్య పరికరాలు సమకూర్చాలని ప్రజా సంఘాల నాయకులు గౌరిశెట్టి నాగేశ్వరరావు, సుజ్ఞానం జనార్దనరావు, మాజేటి శివశ్రీనివారావు, అజయ్‌ఘోష్‌ కోరారు. శనివారం ఆసుపత్రిని సందర్శించి వారు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. 

Updated Date - 2021-04-11T06:56:53+05:30 IST