వూహాన్‌ నగరంలో 99 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..

ABN , First Publish Date - 2020-06-03T00:36:26+05:30 IST

కరోనా వైరస్ పుట్టుకొచ్చిన వూహాన్‌లో కొత్త కేసులు నమోదు కాలేదని

వూహాన్‌ నగరంలో 99 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా..

బీజింగ్: కరోనా వైరస్ పుట్టుకొచ్చిన వూహాన్‌లో కొత్త కేసులు నమోదు కాలేదని అధికారులు మంగళవారం వెల్లడించారు. సెకండ్ వేవ్‌లో కేసులు పెరగడంతో.. వూహాన్ నగరంలోని ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలన్న లక్ష్యంతో అధికారులు మే 14న టెస్టింగ్‌ క్యాంపెయిన్‌ను ప్రారంభించారు. దీని కోసం ప్రభుత్వం 126 మిలియన్ డాలర్ల(రూ. 947 కోట్లు)ను కేటాయించింది. జూన్ 1 వరకు సాగిన ఈ క్యాంపెయిన్‌లో మొత్తంగా 99 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 300 మందికి మాత్రమే లక్షణాలు లేకుండా కరోనా సోకి ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ 300 మంది వల్ల వైరస్ వ్యాపించే అవకాశం లేదని.. వీరు వాడిన ప్రతి వస్తువును తనిఖీ చేసినట్టు చెప్పారు. కాగా.. వూహాన్‌లో జనవరి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు లాక్‌డౌన్ అమలులో ఉంది. చైనా వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు వూహాన్‌లోనే నమోదయ్యాయి. చైనా వ్యాప్తంగా ఇప్పటివరకు 83,022 కేసులు నమోదుకాగా.. 4,634 మంది మరణించారు.  

Updated Date - 2020-06-03T00:36:26+05:30 IST