దేవాలయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ABN , First Publish Date - 2020-10-30T04:32:21+05:30 IST

ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తొలిమెట్టు వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి.

దేవాలయంలో విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌

ద్వారకాతిరుమల, అక్టోబరు 29: ద్వారకాతిరుమల వెంకటేశ్వరస్వామి దేవాలయంలో తొలిమెట్టు వద్ద విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. గురువారం ఎక్కువుగా ఆ ప్రాంతంలో వివాహాలు జరుగుతుండగా విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో ప్రజలు ఒక్క సారిగా భయబ్రాంతులకు గురై పరుగులు తీశారు. దేవస్థానం సిబ్బంది అప్రమత్తమై వెంటనే విద్యుత్‌ నిలుపుదల చేసి మరలా విద్యుత్‌ పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. ఎటువంటి ప్రమాదం సంభవించలేదని ఎలక్ట్రికల్‌ డీఈ సూర్యనారాయణ తెలిపారు. 


Updated Date - 2020-10-30T04:32:21+05:30 IST