భారత్‌కు మళ్లీ సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు

ABN , First Publish Date - 2021-05-07T06:19:24+05:30 IST

చైనా విమానయాన సంస్థ సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు మళ్లీ ఈ నెల 9 నుంచి విమాన సేవలను ప్రారంభించనుంది...

భారత్‌కు మళ్లీ సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): చైనా విమానయాన సంస్థ సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ భారత్‌కు మళ్లీ ఈ నెల 9 నుంచి విమాన సేవలను ప్రారంభించనుంది. కొవిడ్‌ కారణంగా భారత్‌కు సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ సేవలను నిలిపివేసింది. సిచువాన్‌ తిరిగి సేవలను ప్రారంభించే విధంగా చర్చలు జరపాలని, లేదంటే ముడి ఔషధాల సరఫరాకు అంతరాయం కలుగుతుందని  చైనాలోని భారత రాయబారికి భారత ఔషధ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఫార్మాగ్జిల్‌) డైరెక్టర్‌ జనరల్‌ ఉదయ్‌ భాస్కర్‌ కోరారు. ఈ మేరకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో సిచువాన్‌ ఎయిర్‌లైన్స్‌ తిరిగి సేవలు ప్రారంభిస్తున్నట్లు భాస్కర్‌ తెలిపారు. 70 శాతం ముడి ఔషధాలు చైనా నుంచి వస్తున్నందున సిచువాన్‌ సేవల నిలిపివేతతో భారత కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని ఆ లేఖలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-07T06:19:24+05:30 IST